ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు సాయం కోసం అన్నదాతల నిరీక్షణ

ABN, First Publish Date - 2022-06-25T04:34:37+05:30

వర్షాధార పం టలపైనే జిల్లా వ్యాప్తంగా అధిక మొత్తంలో రైతాంగం వివిధ పంటలను సాగు చేస్తున్నా రు.

దామరగిద్దలో పొలాన్ని చదును చేస్తున్న రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రైతుబంధు 28 నుంచి  జమ చేస్తామన్న సీఎం 

- పెట్టుబడి సహాయంపై  అన్నదాతల్లో చిగురించిన ఆశలు 


నారాయణపేట, జూన్‌ 24: వర్షాధార పం టలపైనే జిల్లా వ్యాప్తంగా అధిక మొత్తంలో రైతాంగం వివిధ పంటలను సాగు చేస్తున్నా రు. మక్తల్‌ నియోజకవర్గానికి సంగంబండ, భూత్పూర్‌ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరం దుతుండగా, మిగతాచోట్ల బోర్ల కింద అరకొరగా సేద్యం చేస్తున్నారు. మొత్తంమీద అధిక మొత్తం లో అన్నదాతలు వర్షాధార పంటలపైనే ఆధారప డ్డారు. జిల్లాలో ప్రధానంగా పత్తి, కంది పంటల ను విస్తారంగా సాగు చేస్తారు. సాగునీటి వనరు ల కింద వరి పంటను సాగు చేయడం ఆనవా యితీ. అయితే, ప్రస్తుతం వానాకాలం ఖరీఫ్‌ సా గు పనులకు శ్రీకారం చుట్టిన అన్నదాతలకు ప్ర భుత్వం నుంచి అందే రైతుబంధు పెట్టుబడి సహాయం కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే పొలా లు దుక్కి దున్ని ఉంచుకోగా కొన్ని మండలాల్లో పత్తి విత్తనాలను సైతం విత్తారు. రైతుబంధు విడుదలలో జాప్యం జరుగుతుండడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుచేసి సాగు చేయాల్సి వచ్చిందని రైతులు వాపోయారు. రైతు ల ఆర్థిక ఇబ్బందులను గుర్తించి జాప్యం జరుగ కుండా రైతుబంధు పెట్టుబడి సహాయం ప్రభు త్వం రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరుతు న్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌ జూన్‌ 28నుంచి రైతు బంధు పెట్టుబడి సహాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించడంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. పేట జిల్లా వ్యాప్తంగా 2.11 లక్షల మంది రైతులు ఉన్నారు. నారాయణపేట జిల్లాలోని 11 మండలాల్లో ఖరీఫ్‌ వానాకాలంలో 4,66,050 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారు. జిల్లాకు 51.912 వేల క్వింటాళ్ల విత్తనాలతో పాటు, 66,357 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమౌతాయి. 1,47,651 ఎకరాల్లో సాగయ్యే వరికి 44,295 క్వింటాళ్ల విత్తనాలు అవ సరమవుతాయి. 1,22,617 ఎకరాల్లో సాగయ్యే కం దికి 4,904 క్వింటాళ్లు, 1,82,317 లక్ష ఎకరాల్లో సా గయ్యే పత్తికి 1,823 క్వింటాళ్లు, 5,780 ఎకరాల్లో సాగయ్యే జొన్న పంటకు 231 క్వింటాళ్ల విత్తనా లు అవసరమవుతాయి. ఇతర పంటలు 2,625 ఎకరాల్లో సాగయ్యే అవకాశముంది. కాగా, రైతు బంధు డబ్బులను జమ చేయాలంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర సన కార్యక్రమాలను నిర్వహించారు. రైతు  సంఘాల నాయకులు రైతుబంధు పథకాన్ని అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 



Updated Date - 2022-06-25T04:34:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising