ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామగుండం ఫర్టిలైజర్‌ ఫ్యాక్టరీతో అన్నదాతల్లో ఆనందం

ABN, First Publish Date - 2022-11-11T23:02:34+05:30

రామగుండంలో రూ.8వేల 300కోట్లతో నిర్మించిన ఫర్టిలైజర్‌ ఫ్యాక్టరీని ప్రధాని మో దీ శనివారం జాతికి అంకితం చేయనుండడంతో రైతు లు ఆనందం వ్యక్తం చేస్తున్నారని జాతీయ బీసీ కమి షన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి తెలిపారు.

మాట్లాడుతున్న జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి

కల్వకుర్తి, నవంబరు 11 : రామగుండంలో రూ.8వేల 300కోట్లతో నిర్మించిన ఫర్టిలైజర్‌ ఫ్యాక్టరీని ప్రధాని మో దీ శనివారం జాతికి అంకితం చేయనుండడంతో రైతు లు ఆనందం వ్యక్తం చేస్తున్నారని జాతీయ బీసీ కమి షన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి తెలిపారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ ముఖం చాటేయ కుండా హాజరు కావాలని ఆయన కోరారు. కల్వకుర్తి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆచారి మాట్లాడారు. ప్రధాని మోదీ కార్యక్రమాన్ని నియోజకవర్గ రైతులు ఆ మన్‌గల్లు పట్టణంలో భవానీ ఫంక్షన్‌హాల్‌లో ఎల్‌ఈడీ ద్వారా వీక్షించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రా మగుండం ఎరువుల ఫ్యాక్టరీ అందుబాటులోకి రానుండ డం వల్ల రైతులకు ఎరువుల సమస్య తీరనుందన్నారు. గతంలో ఎరువుల కోసం రైతులు ధర్నాలు, ఉద్యమాలు చేశారని, క్యూలైన్లలో చెప్పులను ఉంచిన విషయాన్ని గు ర్తు చేశారు. అధిక వర్షాల వల్ల అన్నదా తలు పంటలు తీ వ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని, కేంద్రం తీసుకొచ్చిన ఫస ల్‌బీమాను రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉప యోగించుకొని ఉం టే రైతులకు ప్రయో జనం దక్కేదన్నారు. రాష్ట్రంలో పక్షపాతం లో ఉన్న కమ్యూని స్టులతో సీఎం కేసీఆర్‌ జత కట్టారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డిని ఓడించడానికి సీపీఎం, సీపీఐలతో కలిసారని పేర్కొన్నారు. ప్రజా తీర్పును తా ము గౌరవిస్తామని అన్నారు. రాష్ట్రంలో మహిళా గవ ర్నర్‌ను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. రోజుకో పార్టీ మారే వారు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ధరణి పథకంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కోట్లు సంపాదించారని విమర్శించారు. సమావేశంలో బీజేపీ నాయకులు నర్సింహ, రాఘవేందర్‌గౌడ్‌, కృష్ణగౌడ్‌, రవిగౌడ్‌, సురేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-11T23:02:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising