ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ గింజను కొనుగోలు చేయాలి

ABN, First Publish Date - 2022-05-25T04:40:29+05:30

మక్తల్‌ నియోకవర్గంలో రైతులు పండించిన మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ మక్తల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.

దర్నాలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వాకిటి శ్రీహరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మక్తల్‌, మే 24 : మక్తల్‌ నియోకవర్గంలో రైతులు పండించిన మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ మక్తల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల నుంచి ప్రతీ గింజను కొనుగోలు చేయాలన్నారు. రైతులకు గన్నీ బ్యాగులు ఇవ్వడంలో ఇబ్బందులు పెడుతున్నారని, అంతే కాకుండా రైతులు పండించిన ధాన్యానికి సరైన వసతులు లేక అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తడిసిన ధాన్యంతో పాటు ప్రతీ గింజను కొనుగోలు చేయాలన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో నాలుగు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు దుక్కి దున్నుకోవడానికి పెట్రోల్‌, డీజిల్‌ పట్టణంలోని బంకుల్లో లేకపోవడం తో రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతు న్నారన్నారు. సంబంధిత అధికారులు స్పందించి పెట్రోల్‌, డీజిల్‌ అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీటీ కాళప్పకు వినతిపత్రం అందించారు. సీఐ సీతయ్య ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సిములు, మండలాధ్య క్షుడు గణేష్‌కుమార్‌, పట్టణ అధ్యక్షుడు రవికుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు నాగేందర్‌, వెంకటేష్‌,  గోవర్దన్‌,  నారాయణ, వెంకటేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T04:40:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising