ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన సమష్టి బాధ్యత

ABN, First Publish Date - 2022-07-02T05:39:20+05:30

బాలలకు ఉజ్వల భవి ష్యత్తు అందించడం మనం దరి బాధ్యత అని జిల్లా ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అ న్నారు.

మాట్లాడుతున్న ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నెలరోజుల పాటు ఆపరేషన్‌ ముస్కాన్‌

- ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు

మహబూబ్‌నగర్‌, జూలై 1 : బాలలకు ఉజ్వల భవి ష్యత్తు అందించడం మనం దరి బాధ్యత అని జిల్లా ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు అ న్నారు. జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు నెల రోజులపాటు ఆపరేషన్‌ ముష్కాన్‌ పేరిట బడిబ యటి పిల్లలను చేరదీసి బ డిలో చేర్పించాలని సూచించారు. అదే సమయంలో బాలలను కార్మికులుగా మార్చే వ్యక్తు లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఆపరేషన్‌ ముష్కాన్‌ కార్యక్రమం నిర్వహణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ 18 ఏళ్లలోపు పిల్లలను పశువుల కాపరులుగా, హోటల్‌లో వెయిటర్లుగా, మెకానిక్‌ దుకాణాలు, కిరాణం, ఇటుకబట్టీలు, పౌలీ్ట్రఫాంలు ఇతర ప్రదేశాల్లో పనిచేయిం చడం, బిక్షాటన చేయించడం నేరం అవుతుందన్నారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిం చేందుకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిచే పర్యవేక్షణ చేయించాలని సూచించా రు. బాలల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించడం ప్రధాన అంశంగా తీసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా ఎక్కడైనా బాలకార్మికులు పనిచేస్తున్నట్లుగా కనిపిస్తే పోలీసు లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆదనపు ఎస్పీ రాము లు, డీఎస్పీ రమణారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ హనుమప్ప, బాలల సంక్షేమ శాఖ అధికారులు నర్మద, నయీముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T05:39:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising