ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు ప్రారంభించాలి

ABN, First Publish Date - 2022-12-16T23:06:06+05:30

జిల్లాలోని పలు విద్యుత్‌ సబ్‌ స్టేష న్లు పూర్తయినా నేటికీ ప్రారంభించలేదని, వెంటనే ప్రారంభించేలా చర్యలు తీ సుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ ఆదేశించారు.

సమావేశంలో వివరాలు తెలుసుకుంటున్న జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- స్థాయీ సంఘాల సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 16: జిల్లాలోని పలు విద్యుత్‌ సబ్‌ స్టేష న్లు పూర్తయినా నేటికీ ప్రారంభించలేదని, వెంటనే ప్రారంభించేలా చర్యలు తీ సుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ ఆదేశించారు. సబ్‌ స్టేషన్‌లలో పని చేసేందుకు ఆపరేటర్ల కొరత ఉందని విద్యుత్‌ శాఖ డీఈ సంజీవ్‌రెడ్డి చెప్ప గా, తాత్కాలిక పద్ధతిలో ఆపరేటర్లను తీసుకొని సబ్‌స్టేషన్లు ప్రారంభించా లని ఆదేశించారు. శుక్రవారం జడ్పీ కార్యాలయంలో 1వ, 7వ స్థాయీ సం ఘాల సమావేశాలు జడ్పీ చైర్‌పర్సన్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ విద్యుత్‌ వినియోగదారులకు సబ్సిడీని అందించాలని కోరారు. గిరి వికాసం కార్యక్రమంలో మిగిలిన దరఖాస్తులను వెంటనే పూర్తిచేసి లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చాలని ఆదేశించారు. కృష్ణ, మ క్తల్‌, మాగనూర్‌ మండలాల్లో నెలకొన్న నీటి సమస్యను వెంటనే పరి ష్కరించాలని, కొత్తగా మోటార్లను బిగించాలని సంబంధిత అదికారులను ఆదేశించారు. ధన్వాడలో నిర్మించాల్సిన మిషన్‌ భగీరథ ట్యాంకు గురించి చైర్‌ పర్సన్‌ అధికారులతో ఆరా తీశారు. అదేవిధంగా ఊట్కూర్‌, మరికల్‌లో ట్యాం కులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జడ్పీ కోఆప్షన్‌ వహీద్‌ మా ట్లాడుతూ గున్ముక్లలో నీటి ఎద్దడి ఉందని మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేద ని సభలో చెప్పడంతో ఈఈ సమస్యను పరిష్కరిస్తామ న్నారు. పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి పెండింగ్‌లోని సీఆర్‌ఆర్‌ పనులు, ఎస్‌బీ పనులు, ఎమ్మార్‌ ఆర్‌బీటీ రెవెన్యూ, పంచాయతీ భవనాలను వెంటనే పూర్తి చేయాలని మహిళ, చిన్నారుల వెల్ఫేర్‌కు సంబంధించి భవనాలు ప్రారంభం కానీ చోట రద్దు చేసి మరో గ్రామానికి కేటాయించాలని ఆదేశిం చారు. రోడ్లు, భవనాలకు సంబంధించి పెండింగ్‌లోని దండు, ముష్టిపల్లి రోడ్డును పూర్తి చేయాలని, నారాయణపేట మక్తల్‌ రోడ్డు ఎప్పుడు పూర్తి చేస్తారని వెంటనే ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లోని పంచాయతీ, లింక్‌ రోడ్లు దెబ్బతిన్నాయని వాటిని సరి చేయాలని ఆమె అధి కారులను ఆదేశించారు. సమావేశంలో జడ్పీ కోఆప్షన్‌ వహీద్‌, సంబంధిత జి ల్లా అధికారులు పాల్గొన్నారు. అలాగే 6వ స్థాయీ సంఘం సమావేశం దా మరగిద్ద జడ్పీటీసీ సభ్యురాలు లావణ్య అధ్యక్షతన జరగ్గా ధన్వాడ జడ్పీటీసీ స భ్యురాలు విమలాదేవి పాల్గొన్నారు. బీసీ సంక్షేమంపై, గిరిజన సంక్షేమం, షెడ్యూల్డ్‌ కులాల మైనార్టీ సమస్యలపై చర్చించారు. 3వ స్థాయీ సంఘం సమావేశం జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సురేఖ అధ్యక్షతన నిర్వహించారు. సమా వేశంలో వ్యవసాయం, పశువైద్యం, ఉద్యానవన, అటవీ శాఖ, మత్స్యశాఖ, భూగర్భ శాఖ, జలవనరుల శాఖల ప్రగతిపై చర్చించారు.

Updated Date - 2022-12-16T23:06:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising