సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
ABN, First Publish Date - 2022-12-16T23:02:21+05:30
గ్రామాల్లో సమ స్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఎంపీపీ గాయత్రి సూచించారు.
- సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ గాయత్రి
శ్రీరంగాపురం, డిసెంబరు 16: గ్రామాల్లో సమ స్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఎంపీపీ గాయత్రి సూచించారు. శుక్రవారం ఎం పీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు పేర్కొన్న సమస్యలను మీ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించాలన్నారు. జడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడు తూ మహిళా సమాఖ్యలో ఉన్న పథకాలను మహిళలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవా లని అన్నారు. మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం లేదని తాటిపాముల ఎంపీటీసీ సభ్యు రాలు పార్వతమ్మ సభ దృష్టికి తీసుకొచ్చారు. మండలంలో మిషన్ భగీరథ పథకం అస్తవ్యస్తం గా తయారైందని సర్పంచులు సత్యంయాదవ్, ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు ఎల్లస్వామి యాదవ్‌లు తెలిపారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో పెండింగ్ పనులను పూర్తి చేయా లని వారు సూచించారు. సమావేశంలో తహసీ ల్దార్ అబ్రహంలింకన్, ఎంపీడీవో ప్రసన్నకుమారి, వైస్ ఎంపీపీ మహేశ్వర్‌రెడ్డి, సింగిల్ విండో అధ్య క్షుడు జగన్నాథంనాయుడు, అధికారులు రమేష్ నాయుడు, జయరాములు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T23:02:23+05:30 IST