ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితబంధుతో ఆర్థికంగా ఎదగాలి : ఎమ్మెల్యే ఆల

ABN, First Publish Date - 2022-08-15T05:33:27+05:30

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధుతో యువ కులు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరెడ్డి ఆకాంక్షించారు.

సంకలమద్దిలో చీరలను మహిళలకు అందజేస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడ్డాకుల, ఆగస్టు 14 : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధుతో యువ కులు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం అడ్డాకు ల, తిమ్మాయిపల్లి గ్రామాల్లో 10 మంది దళితబంధు లబ్ధిదారులకు చెందిన యూనిట్లను ప్రారంభించారు. ఇదిలా ఉండగా అడ్డాకులకు చెందిన కుమ్మరి చెన్నయ్య, గొల్ల శేఖర్‌, రాచా లకు చెందిన లక్ష్మమ్మ, పొన్నకల్‌కు చెందిన చిన్నరాములు, కాటవరానికి చెందిన చంద్ర య్యల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పుల రైతుబీమా చెక్కులను పంపి ణీ చేశారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన రమేశ్‌ను పరామర్శించారు. అంతకు ముందు అడ్డాకులలో దళితబంధు లబ్ధిదారుని షాపును ప్రారంభించిన సందర్భం గా అక్కడే ఉన్న వైస్‌ఎంపీపీకి, ఎంపీడీవో మంజులకు, సర్పంచు మంజులకు, ఎంపీవో విజ యకుమారికి చీరలు కొని వారికి బహూకరించి సోదరభావాన్ని చాటుకున్నారు. కార్యక్రమం లో ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు జితేం దర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మండల రైతుబంధు అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, వైస్‌ఎంపీపీ రాధిక, టీఆర్‌ఎస్‌ మహిళా మండల అధ్యక్షురాలు సుజాత, మండల కోఆప్షన్‌ ఖాజాఘోరి, ఎంపీడీవో మంజుల, ఏవో శ్రీనివాసులు, ఎంపీవో విజయ కుమారి, సర్పంచు ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

దళితులు అన్ని రంగాల్లో రాణించాలి : ఎమ్మెల్యే 

మూసాపేట : దళితులు అన్ని రంగాల్లో రాణించినప్పుడే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని సంకలమద్ది గ్రామంలో సర్పంచ్‌ స్వరూపారాణి దళితబంధు పథకం ద్వారా ఏర్పాటు చేసిన లేడీస్‌ ఎంపోరియం సారీ సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం దళిత బంధు ద్వారా చెంద్రాయు డుకు మంజూరైన కారును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు ఇంద్రయ్య సాగర్‌, పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహ యాదవ్‌, సర్పంచ్‌లు చంద్ర శేఖర్‌, స్వరూప, నాయకులు మల్లయ్య, హైమద్‌, శరత్‌గౌడ్‌, రెడ్డి రాజు, కోట్ల రవి, సత్యనారాయణరెడ్డి, రఘు, ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-15T05:33:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising