పలువురు నాయకుల ముందస్తు అరెస్టు
ABN, First Publish Date - 2022-12-04T23:08:20+05:30
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు పర్యటన నేపథ్యంలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాలకు చెందిన పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
గద్వాల క్రైం/ అయిజ/ గట్టు, డిసెంబరు 4 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు పర్యటన నేపథ్యంలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాలకు చెందిన పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. గద్వాల పట్టణంలో కాంగ్రెస్ నాయకులు వీరబాబు, జమాల్, వాల్మీకీ బోయల సంఘం నాయకులు కోటేశ్, నారాయణరెడ్డి, బీజేవైఎం నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, మోహన్ రెడ్డితో పాటు ముగ్గురు వీఆర్‌ఏలను అరెస్ట్ చేసినట్లు పట్టణ ఎస్‌ఐ-2 అబ్డుల్ షుకూర్ తెలిపారు.
- అయిజకు చెందిన వాల్మీకీ బోయల సంఘం నాయకులను శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. రాత్రివేళ ఇళ్లలో ఉన్న నాయకులను అరెస్ట్ చేయడం అక్రమమని ఆ సంఘం నాయకులు రామదాసు, మేడికొండ వెంకటేష్, అయిజ వెంకటేష్. తిమ్మప్ప, మాసుం అన్నారు. ఆదివారం సాయంత్రం వారిని సొంత పూచికత్తుపై విడుదల చేశారు.
- చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేయాలని 310 రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న నిర్వాసితులను గట్టు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ 310 రోజులుగా రిలేదీక్షలు చేస్తున్నా, పట్టించుకోని ప్రభుత్వం, తమను అరెస్టు ఎలా చేస్తారని ప్రశ్నించారు. సమస్య పరిష్కారమయ్యే దాకా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Updated Date - 2022-12-04T23:08:22+05:30 IST