ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఊరికి దూరంగా ఏర్పాటు చేయొద్దు

ABN, First Publish Date - 2022-12-07T23:14:09+05:30

ఊరికి దూరం గా, గుట్టల మధ్యలో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాల యం ఎవరికి మేలు చేయడం కోసం ఏర్పాటు చేస్తున్నారని వనపర్తి మునిసిపల్‌ అధికార పా ర్టీ కౌన్సిలర్లు ప్రశ్నించారు.

కమిషనర్‌ విక్రమసింహారెడ్డికి వినతిపత్రం ఇస్తున్న అధికార పార్టీ కౌన్సిలర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మునిసిపల్‌ కమిషనర్‌కు కౌన్సిలర్ల వినతి

వనపర్తి టౌన్‌, డిసెంబరు 7: ఊరికి దూరం గా, గుట్టల మధ్యలో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాల యం ఎవరికి మేలు చేయడం కోసం ఏర్పాటు చేస్తున్నారని వనపర్తి మునిసిపల్‌ అధికార పా ర్టీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. కార్యాలయం ఊర్లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. బుధ వారం జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ కార్యాల యంలో కమిషనర్‌ విక్రమసింహారెడ్డిని తన చాంబర్‌లో కలిసిన కౌన్సిలర్లు వినతిపత్రం ఇ చ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణంలో అద్దెభవనంలో కొనసా గుతున్న సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాన్ని స్వంత భవనం ఏర్పాటు చేయడం కోసం ఊరికి దూ రంగా నిర్మించాలనుకోవడం హాస్యాస్పదమన్నా రు. నూతన సమీకృత భవనం నిర్మించిన త రువాత చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలు అక్కడికి మారాయని, దీంతో పట్టణంలోనే అనేక భవనాలు ఖాళీగానే ఉన్నాయన్నారు. ఊరికి దూరంగా, గుట్టల మధ్య కార్యాలయం నిర్మిస్తే పట్టణ ప్రజలతో పాటు వృద్ధులకు, ది వ్యాంగులకు ఎంతో ఇబ్బందిగా మారుతుంద ని అన్నారు. ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు పట్టణంలోనే కార్యాలయాన్ని ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిల ర్లు పాకనాటి కృష్ణ, బండారు కృష్ణ, సత్యం సాగర్‌, నాగన్న యాదవ్‌, జంపన్న యాదవ్‌, బాషా నాయక్‌, సమ్మద్‌, నాయకులు ఎల్‌ఐసీ కృష్ణ, శేఖర్‌, గోపాల్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

పట్టణంలోనే కొనసాగించాలి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా: సబ్‌ రిజిస్ర్టేషన్‌ కా ర్యాలయం వనపర్తి పట్టణంలోనే కొనసాగిం చాలని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నా రని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీ ష్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం అఖిలపక్ష ఐ క్యవేదిక ఆధ్వర్యంలో సబ్‌ రిజిస్ర్టార్‌ క్రిష్టఫర్‌కు వినతిపత్రం అందజేశారు. కొందరి స్వప్రయో జనాలను చూడొద్దని, ప్రజలకు సౌకర్యంగా ఉండే ప్రాంతంలోనే కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక నాయకు లు వెంకటేశ్వర్లు, నందిమల్ల చంద్ర మౌళి, జానంపేట రాము, బొడ్డుపల్లి సతీష్‌, గో పాల కృష్ణ నాయుడు, దస్తావేజు లేఖర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:14:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising