ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ పాఠశాలలో తరగతులు నిర్వహించొద్దు

ABN, First Publish Date - 2022-07-14T04:48:22+05:30

మద్దూర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితి పై ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో ‘వర్షపు నీరంతా పాఠశాలలోనే’ అనే శీర్షికతో ఈనెల 9న ప్రచురించిన వార్తకు డీఈవో లియాఖత్‌ అలీ స్పందించారు.

పాఠశాలను పరిశీలిస్తున్న డీఈవో లియాఖత్‌ అలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డీఈవో లియాఖత్‌ అలీ

మద్దూర్‌, జూలై 13 : మద్దూర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితి పై ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో ‘వర్షపు నీరంతా పాఠశాలలోనే’ అనే శీర్షికతో ఈనెల 9న ప్రచురించిన వార్తకు డీఈవో లియాఖత్‌ అలీ స్పందించారు. ఈ మేరుకు బుధవారం పాఠశాలను సందర్శంచి తరగతి గదులను పరిశీలించారు. తరగతి గదులన్నీ శిలావస్థకు చేరి కూలడానిక సిద్ధంగా ఉండడాన్ని గమనించిన డీఈవో ప్రమాద భరితంగా మారిన పాఠశాలలో తరగతులు నిర్వహించొద్దని మరోచోట నిర్వహణ కు చర్యలు తీసుకోవాలి ఎంఈవోను ఆదేశించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 190మంది విద్యార్థులు ఉన్నారని, బాలికల పాఠశాలలో సరిపోరని హెచ్‌ ఎం రాజరత్నం పేర్కొన్నారు. ఎక్కడైన అనువైన భవనాలను పరిశీలించాలని సూచించారు. అంతవరకు తాత్కాలికంగా తరగతులను కొనసాగింపునకు నూతన ఇంటిని ఇచ్చేందుకు ఎంపీటీసీ సభ్యుడు వెంకటయ్య ముందుకొచ్చారు. మన ఊరు- మన బడి కింద పాఠశాలలో నూతన గదుల నిర్మాణానికి రూ.63 లక్షలు మంజూరైనట్లు డీఈవో తెలుపగా ఈ నిధులు సరిపోవని కోటి రూపాయలు మంజూరు చేయాలని సర్పంచ్‌ అరుణ, ఎంపీపీ విజయలక్ష్మి డీఈవోను కోరారు. ఏఎంవో విద్యాసాగర్‌, ఎస్‌వో శ్రీనివాస్‌, డీఎస్‌వో భానుప్రకాశ్‌, ఎంఈవో గోపా ల్‌నాయక్‌, నాయకులు సంజీవ్‌, వెంకట్రాములు గౌడ్‌, సీఆర్పీలు కృష్ణారెడ్డి, కాలప్ప పాల్గొన్నారు.

Updated Date - 2022-07-14T04:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising