ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసిన జిల్లా నాయకులు
ABN, First Publish Date - 2022-10-18T04:31:52+05:30
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో జిల్లా నుంచి ముగ్గురు నాయకులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గద్వాల, అక్టోబరు 17 : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో జిల్లా నుంచి ముగ్గురు నాయకులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లోని పోలింగ్ బూత్‌లో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సం పత్ కుమార్, టీపీసీసీ సభ్యులు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, గంజిపేట శంకర్ తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య బద్ధంగా సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడి వచ్చే అసెంబ్లీ ఎన్నికలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారన్నారు.
Updated Date - 2022-10-18T04:31:52+05:30 IST