ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌తోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి

ABN, First Publish Date - 2022-01-27T05:16:52+05:30

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి పేర్కొన్నారు.

అయ్యవార్‌పల్లి గ్రామంలో పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి 

- నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

దామరగిద్ద, జనవరి 26 : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అయ్యవార్‌పల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని బుధవారం ప్రారంభించి మాట్లాడారు. నిరుపేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలి చిందన్నారు. రైతు బీమాతో పాటు రైతు బంధు పథకం ప్రవేశపెట్టిందన్నారు. కేంద్రం తెలంగాణకు చేసిందేమిలేదని, కులాల మధ్య చిచ్చుపెడుతూ ఓట్ల కోసం రాజకీయం చేస్తుందన్నారు. తెలంగాణలో జరుగు తున్న అభివృద్ధిని చూసి ఒర్వలేక కొందరు బీజీపీ నాయకులు ప్రభుత్వాన్ని విమర్శి స్తుందన్నారు. అయ్యవార్‌పల్లి స్టేజి నుంచి గ్రామం బీటీ రోడ్డు, అంగన్‌వాడీ భననాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మండలంలో పెండింగ్‌లో ఉన్న ప్రతి రోడ్డుపై దృష్టి సారించి తక్షణ చర్యలు చేపడుతానన్నారు. దేశాయిపల్లి, ముస్తాపేట్‌ గ్రామాలకు సీసీ రోడ్లు నిర్మాణ కోసం రూ.3 లక్షల నిధులు మంజూరీకి హామీ ఇచ్చారు. అనంతరం సీఎం సహాయ నిఽధి చెక్కులను అందించారు. గ్రామంలో డీవైఎఫ్‌ఐ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో విజేతలైన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో నాయకులు ఎంపీపీ నర్సప్ప, విండో అధ్యక్షుడు ఈ దప్ప, రైతు సమన్వయ కమిటీ జిల్లా నా యకుడు వెంకట్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చై ర్మన్‌ భాస్కరకుమారి, వైస్‌ ఎంపీపీ దామోదర్‌రెడ్డి, నారాయణపేట ఎంపీపీ అమ్మకోళ్ళ శ్రీనివాస్‌, టీఆర్‌ ఎస్‌ మండలాధ్యక్షు డు ఆశన్న, భీమయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T05:16:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising