టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం
ABN, First Publish Date - 2022-03-06T04:55:32+05:30
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
- ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
- కోస్గిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
కోస్గి, మార్చి 5 : టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మునిసిపాలిటీ పరిధిలో శనివారం మునిసిపల్ చైర్పర్సన్ మ్యాకల శిరీషతో కలిసి 1, 2, 7వ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే మునిసిపాలిటీ అభివృద్ధి జరుగుతోందన్నారు. ప్రతీ వార్డులో సీసీ, డ్రైనేజీ నిర్మాణాలతో కాలనీల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు విస్తరణపై సమావేశం
కోస్గి రామాలయం నుంచి సయ్యద్పహడ్ దర్గా వరకు నూతన బీటీ రోడ్డు మంజూరుకావడంతో ఆర్అండ్బీ అధికారులు 33 ఫీట్ల మేర మార్కింగ్ ఇచ్చారు. దీంతో శనివారం రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోవల్సి వస్తోందని, 20 ఫీట్ల మేర మాత్రమే మార్కింగ్ ఇవ్వాలని బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసు కెళ్లారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న వారికి సొంత స్థలం ఉంటే ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటానన్నారు. అదే విధంగా డబుల్ బెడ్ రూం ఇళ్లలో మొదటి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. సమావేశంలో మునిసిపల్ చైర్పర్సన్ మ్యాకల శిరీష, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శాసం రామకృష్ణ, కౌన్సిలర్లు జనార్ధన్‌రెడ్డి, లక్ష్మీ, బందెప్ప, గోవర్ధన్‌రెడ్డి, ఇద్రీస్, భానునాయక్, డీసీసీబీ డైరెక్టర్ భీంరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ప్రకాశ్‌రెడ్డి, ఏఎంసీ వీరారెడ్డి, వైస్ చైర్మన్ వరప్రసాద్, కో అప్షన్ సభ్యుడు ఓంప్రకాశ్, అమృతమ్మ, రాజేశ్, హరి, బాల్‌రాజ్, వెంకట్‌నర్సిములు, రామకృష్ణారెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-06T04:55:32+05:30 IST