ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనుల వివరాలు అందించాలి

ABN, First Publish Date - 2022-08-09T05:12:15+05:30

రాజోలి మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద అం దించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కోరారు.

ఎంపీడీవో గోవింద్‌రావుకు వినతి పత్రం అందజేస్తున్న బిజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి

రాజోలి, ఆగష్టు 8 : రాజోలి మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద అం దించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం రాజోలి ఎంపీడీవో గోవిందరావుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎఎస్‌ ప్రభుత్వం పల్లెలకు చాలా అన్యాయం చేసిందన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్‌ఏలు చేపట్టిన సమ్మెలో పాల్గొని మద్దతు పలికారు. కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రాజగోపాల్‌, నాయకులు సంజీవరెడ్డి, నర్సింహులు, గోవిందు, రాము, శశికుమార్‌, ఈరన్న పాల్గొన్నారు.


నిధుల సమాచారం ఇవ్వండి

గద్వాల : గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులపై సమాచారం ఇవ్వాలని బీజేపీ ఆర్టీఐ ఇన్‌చార్జి తుమ్మల నర్సింహులు, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌ కోరారు. ఈ మేరకు వారు గద్వాల ఎంపీడీవో, వ్వవసాయ శాఖ కార్యాలయాల్లో ఎంపీడీవో రవీంద్ర, ఏవో ప్రతాప్‌కుమార్‌లకు దరఖాస్తులను అందించారు. 2014 నుంచి 2022 వరకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించి, రాష్ర్టాలకు ఇచ్చిం దని తెలిపారు.  కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు వడ్ల రమేష్‌, సంగాల సర్పం చు కృష్ణ, బీజేవైఎం మండల అధ్యక్షుడు పసుల రామకృష్ణ, రాంరెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T05:12:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising