ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బలమైన బ్యాంకుగా డీసీసీబీ

ABN, First Publish Date - 2022-05-25T05:28:17+05:30

బలహీనమైన బ్యాంకుగా ఉన్న డీసీసీబీ బ్యాంకు 2021-22లో బలమైన బ్యాంకుగా ఎదగటం సంతోషంగా ఉందని అధ్యక్షుడు సి.నిజాంపాషా అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మీడియా సమావేశంలో డీసీసీబీ అధ్యక్షుడు సి.నిజాంపాషా

పాలమూరు, మే 24 : బలహీనమైన బ్యాంకుగా ఉన్న డీసీసీబీ బ్యాంకు 2021-22లో బలమైన బ్యాంకుగా ఎదగటం సంతోషంగా ఉందని అధ్యక్షుడు సి.నిజాంపాషా అన్నారు. మంగళవారం డీసీసీబీ చాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు విషయాలను వివరించారు. రాష్ట్రంలోని ఏ సహకార బ్యాంకు అయిన నిరర్ధక ఆస్తులను పది శాతానికి మించి ఉంటే ఆ బ్యాంకు బలహీనమైనదిగా గుర్తిస్తారని తెలిపారు. పదేళ్ల నుంచి బలహీన స్థా యిలో ఉన్న బ్యాంకును బలమైన బ్యాంకుగా మార్చటంలో అధికారులు, బ్యాం కు సిబ్బంది, పాలకవర్గం చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.16.25 కోట్ల వ్యాపారాన్ని పెంచి రూ.1196.59కోట్ల చేరిందన్నారు. బ్యాంకు మూలధనం రూ.86.64 కోట్లు నుంచి రూ.91.40 కోట్లకు చేరిందన్నారు. ఈ ఆర్థి క సంవత్సరంలో గరిష్టంగ లాభం రూ.16 కోట్ల 68 లక్షలు బ్యాంకు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా లాభాలు గడించటం, నిరర్ధక ఆస్తులను తగ్గించడంలో ఉమ్మడిగా అందరు విశేషమైన కృషి చేశారన్నారు. వివిధ రంగాలలో బ్యాంకు రూ.930.41కోట్లు రుణాలను బట్వాడా చేశామన్నారు. బ్యాంకు అభివృద్ధికి ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు ఇస్తున్న మంత్రులు ఎస్‌.నిరంజన్‌ రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో సీఈఓ టి.లక్ష్మయ్య, జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.వెంకటేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T05:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising