ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటలకు రక్షణ కల్పించాలి

ABN, First Publish Date - 2022-03-05T05:02:05+05:30

అడవి జంతువుల దాడి నుంచి పంటలను రక్షించాలని బీకేఎస్‌ జిల్లా అధ్యక్షుడు కావలి వెంకటేష్‌ కోరారు.

బీకేఎస్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- తహసీల్దార్‌ కార్యాలయం ముందు రైతుల ధర్నా

మక్తల్‌, మార్చి 4: అడవి జంతువుల దాడి నుంచి పంటలను రక్షించాలని బీకేఎస్‌ జిల్లా అధ్యక్షుడు  కావలి వెంకటేష్‌ కోరారు.  మండలంలోని వివిధ గ్రామాల్లో రైతు ల పంటలను నాశనం చేస్తున్న అడవి జంతువుల బారి నుంచి పంటలు కాపాడాల ని డిమాండ్‌ చేస్తూ బీకేఎస్‌ ఆధ్వర్యంలో రాంలీలా మైదానం నుంచి తహసీల్దార్‌ కా ర్యాలయం వరకు  దండు, కర్ని, ఖానాపూర్‌, రుద్రసముద్రం, గోలపల్లి, కాచ్‌వార్‌ గ్రా మాల రైతులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం వద్ద బీకేఎస్‌ ఆధ్వ ర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీకేఎస్‌ జిల్లా అధ్యక్షుడు కావలి వెంకటేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ పొలాల్లో వేసుకున్న వరి, ఇతర పంటలను అడవి జంతువులు నాశనం చేస్తున్నాయన్నారు. ఆరుగాలం కష్టించినా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు బీజేపీ  నాయకుడు కొండయ్య, పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో బీకేఎస్‌ మండల అధ్యక్షుడు కర్ని శ్రీనివాసులు, జిల్లా నాయకులు కాళేశ్వర్‌, రైతులు మధుసూదన్‌ రెడ్డి, నారాయణ, రాములు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T05:02:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising