ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-11-18T23:17:10+05:30

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులు, మరుగుదొడ్డు, కాంపౌండ్‌ నిర్మాణం, యోగా సెంటర్‌, అంగన్‌వాడీ కేంద్రాలు, కేజీబీవీలు, సబ్‌సెంటర్‌ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- అభివృద్ధి పనులపై సమీక్ష

గద్వాల క్రైం, నవంబరు 18 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులు, మరుగుదొడ్డు, కాంపౌండ్‌ నిర్మాణం, యోగా సెంటర్‌, అంగన్‌వాడీ కేంద్రాలు, కేజీబీవీలు, సబ్‌సెంటర్‌ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా మినరల్‌ ఫండ్‌ ట్రస్ట్‌ పనులకు సంబంధించిన ఫొటోలను తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాలన్నారు. మన ఊరు - మన బడి ద్వారా చేపట్టిన ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన పనుల పురోగతి గురించి అన్ని మండలాల సమాచారాన్ని సంబంధిత అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీ, అంగన్‌వాడీ కేంద్రాలు, సబ్‌ సెంటర్ల నిర్మాణం, యోగా సెంటర్ల పనులను సత్వరంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. యోగా సెంటర్లలో యోగా, సూర్య నమస్కారాలు చేసే విధంగా పెయింటింగ్‌ చేయించాలన్నారు. యోగా సెంటర్లలో ఖాళీ స్ధలం ఉంటే వాకింగ్‌ ట్రాక్‌, బెంచీలు వేయించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అపూర్వ్‌ చౌహాన్‌, పంచాయతీ రాజ్‌ ఈఈ సమత, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-18T23:17:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising