ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళాశాలలు ఏర్పాటు చేయాలి

ABN, First Publish Date - 2022-10-01T05:12:17+05:30

మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాల లను ఏర్పాటు చేయాలని రాజోలి ఉపసర్పంచు గోపాల్‌, నాయకులు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డికి సమ్యను వివరించి, వినతిపత్రం సమర్పించారు.

మంత్రి నిరంజన్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న ఉపసర్పంచ్‌ గోపాల్‌, గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మంత్రి నిరంజన్‌రెడ్డికి రాజోలి గ్రామస్థుల వినతి

రాజోలి, సెప్టెంబరు 30 : మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాల లను ఏర్పాటు చేయాలని రాజోలి ఉపసర్పంచు గోపాల్‌, నాయకులు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డికి సమ్యను వివరించి, వినతిపత్రం సమర్పించారు. వనపర్తిలోని ఆయన నివాసంలో శుక్రవారం వారు మంత్రిని కలిసి సమస్యను వివరించారు. మం డలంలో 14 ప్రాథమిక, నాలుగు ప్రాథమికోన్నత, ఐదు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలతో పాటు ఐదు ప్రైవేటు బడులున్నాయని తెలిపారు. ప్రతీ ఏటా 650 మంది విద్యార్థులు పదవ తరగతి పూర్తి చేసుకుంటున్నారని చెప్పారు. స్థానికంగా ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశం లేక వారిలో ఎక్కువమంది చదువు కు దూరమవుతున్నారని తెలిపారు. కొందరు విద్యార్థులు పనులకు వెళ్తున్నారని వివరిం చారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాజోలిలో జూనియర్‌ కాళాశాల, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని ఉప సర్పంచు గోపాల్‌ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు నతాని యేలు, చంద్రగౌడు, జయరాములు గౌడు, జయన్న, మాజీ సర్పంచు హుసేన్‌, కళాశాల సాధన సమితి సభ్యులు ఈశ్వరయ్య, తుకారాం పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T05:12:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising