ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా నాగుల పంచమి వేడుకలు

ABN, First Publish Date - 2022-08-03T05:22:51+05:30

నాగుల పంచమిని పురస్కరించుకొని పలుదేవాలయాల వద్ద భక్తు ల రద్దీ అధికంగా కనిపించింది.

భూత్పూర్‌ మునిరంగ స్వామి దేవాలయం ఆవరణలో నాగులకు పాలు పోసి పూజలు చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పుట్టలో పాలుపోసి, మొక్కులు తీర్చుకున్న భక్తులు

మహబూబ్‌నగర్‌ టౌన్‌/ బాదేపల్లి/ దేవరకద్ర/ భూత్పూర్‌/ అడ్డాకుల, ఆగస్టు 2 : నాగుల పంచమిని పురస్కరించుకొని పలుదేవాలయాల వద్ద భక్తు ల రద్దీ అధికంగా కనిపించింది. పంచమి రోజు శివునికి రుద్రాభిషేకం నిర్వహిం చడంతో పాటు నాగదోషం ఉన్న వారు నాగులకు పాలు పోయడం, రాహువు దోషం ఉన్న వారు నాగులను పూజిస్తే దోషం నివారణ అవుతుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా నాగుల చవితి, పంచమి రోజు నాగులకు అభిషేకం చేసి అలంకరించి పాలు పోసి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. పంచమిని పురస్కరించుకొని స్థానిక రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సం ఖ్యలో విచ్చేసి నాగుల విగ్రహాలకు పూజలు చేశారు. స్థానిక శ్రీనివాస్‌కాలనీ పం చముఖ ఆంజనేయ దేవాలయంతో పాటు కాటన్‌మిల్‌ దేవాలయం ముందుగల నాగుల పుట్టకు ప్రజలు పూజలు నిర్వహించారు. బాదేపల్లి చైతన్య నగర్‌లోని బంగారు మైసమ్మ దేవాలయంలోని పుట్టలో, పాత బజార్‌ శివాలయంలోని పుట్టలో పాలు పోసి పూజలు చేశారు.దేవరకద్ర శివాలయంలో స్వామివారికి అ ర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భూత్పూర్‌లోని శ్రీరామలింగేశ్వర స్వామి దే వాలయం, మునిరంగ స్వామి దేవాలయం ఆవరణలో నాగులకు క్షీరాభిషేకం చే శారు. వీహెచ్‌పీ మాతృమండలి మహిళలు పాల్గొన్నారు. అడ్డాకుల శ్రీ శివాంజ నేయ శిరీడీసాయి ఆలయంలో నాగుల విగ్రహాలను పాలతో అభిషేకించారు. 

Updated Date - 2022-08-03T05:22:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising