ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాంతినగర్‌, వడ్డేపల్లిలలో కార్డెన్‌ సర్స్‌

ABN, First Publish Date - 2022-10-12T04:25:02+05:30

కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌ ఆదేశాల మేరకు మునిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌తో పాటు వడ్డేపల్లిలో మంగళవారం రాత్రి గద్వాల డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ శివశంకర్‌ పోలీస్‌ సిబ్బందితో కలిసి కార్డెన్‌ సర్స్‌ నిర్వహించారు.

పోలీస్‌ సిబ్బందితో మాట్లాడుతున్న సీఐ శివశంకర్‌ గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ధ్రువపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాల గుర్తింపు

వడ్డేపల్లి, అక్టోబరు 11 : కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌ ఆదేశాల మేరకు  మునిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌తో పాటు వడ్డేపల్లిలో మంగళవారం రాత్రి గద్వాల డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ శివశంకర్‌ పోలీస్‌ సిబ్బందితో కలిసి కార్డెన్‌ సర్స్‌ నిర్వహించారు. శాంతినగర్‌ సర్కిల్‌ పోలీసులు వడ్డేపల్లి గ్రామంలో 250 ఇళ్లను తనిఖీ చేసి, సరియైున ధ్రువపత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలను గుర్తిం చి వాటికి చలానాలు విధించారు. ఈ సందర్భంగా సీఐ శివశంకర్‌ గౌడ్‌, గుట్కా, గ్యాంబ్లింగ్‌, గంజాయి, గుడుంబా వాడకం వల్లే జరిగే నష్టాలను ప్రజలకు వివరించారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో శాంతినగర్‌, రాజోలి, అయిజ ఎస్‌ఐలు శ్రీనివాస్‌నాయక్‌, లెనిన్‌గౌడ్‌, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-12T04:25:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising