ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘టీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే బీజేపీ ధ్యేయం’

ABN, First Publish Date - 2022-01-20T06:08:56+05:30

నిజాం నియంతలా పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వా న్ని గద్దె దించడమే బీజేపీ ప్రధాన కర్తవ్యమని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు శాంత కుమార్‌, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి పేర్కొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర నాయకుడు శాంతకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలానగర్‌, జనవరి 19 : నిజాం నియంతలా పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వా న్ని గద్దె దించడమే బీజేపీ ప్రధాన కర్తవ్యమని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు శాంత కుమార్‌, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి పేర్కొన్నారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సీహెచ్‌సీ కేంద్రాన్ని ప్రారంభించేందుకు వస్తున్న సందర్భంగా తమ పార్టీ నా యకులను తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ కుమ్మరిరాజు, నాయకులు నాగరాజు, నర్సింహులు, ప్రతాప్‌రెడ్డి, సతీష్‌, నాయకులు ఉన్నారు. 


పురాతన ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలి


మిడ్జిల్‌ : రాష్ట్రంలోని పురాతన ఆలయాలను ప్రభుత్వం వెంటనే అభివృద్ధి పరచాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శాంతకుమార్‌ తెలిపారు. బుధవారం మండలంలోని వెలుగొమ్ముల గ్రామంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల ముగింపు రోజు శాంతికుమార్‌తోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌, జిల్లా ప్రధానకార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి అశోక్‌, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు తిరుపతి, జడ్చర్ల కౌన్సిలర్‌ కుమ్మరి రాజు, టౌన్‌ ప్రసిడెంట్‌ సామాల నాగరాజు, మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డిలతో పాటు పలువురు బీజేపీ నాయకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని స్థానిక నాయకలు ఘనంగా సన్మానించారు.

Updated Date - 2022-01-20T06:08:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising