ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాగ్యరెడ్డి వర్మ దళిత వైతాళికుడు

ABN, First Publish Date - 2022-05-23T05:20:14+05:30

భాగ్యరెడ్డి వర్మ దళిత జాతి కోసం కృషి చేసిన వైతాళికుడని, సంఘసంస్కర్త అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ పేర్కొన్నారు.

గండీడ్‌లో భాగ్యరెడ్డి వర్మ జయంతి నిర్వహిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), మే 22 : భాగ్యరెడ్డి వర్మ దళిత జాతి కోసం కృషి చేసిన వైతాళికుడని, సంఘసంస్కర్త అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ పేర్కొన్నారు. భాగ్యరెడ్డి వర్మ 134వ జయంతిని పుర స్కరించుకొని ఆదివారం కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అద నపు కలెక్టర్‌ మాట్లాడుతూ దళిత బాలికల పాఠశాల వ్యవస్థాపకులని, భాగ్య రెడ్డి చేసిన కృషి మరవలేనిదని అన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో కిషన్‌, కార్యాలయంలోని అన్ని విభాగాల అధిపతులు పాల్గొని భాగ్యరెడ్డి చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఘనంగా భాగ్యరెడ్డివర్మ జయంతి 

పాలమూరు : ఆదివారం జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ భవన్‌లో భాగ్యరెడ్డివర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. సమాజానికి భాగ్యరెడ్డివర్మ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎస్‌ఏవో శ్రీకాంత్‌, ఏఏవో గంగాధర్‌, ఏడీఈ సుధీర్‌రెడ్డి, ఏఈలు, ఉద్యోగులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. 

ఫ దళిత సంఘాల ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ జయంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. దళితుల అభ్యున్నతికి పాటుపడ్డారని, ఆయన సేవలు అందరికీ ఆదర్శనమని అన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకుడు మంత్రి నరసింహయ్య, యాంకి రమేష్‌, ఎడ్ల కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు కావలి కృష్ణయ్య పాల్గొన్నారు. 

భాగ్యరెడ్డి వర్మకు ఘన నివాళి

గండీడ్‌ : తెలంగాణలో దళితులు తమ పరిస్థితిని గుర్తించి, హక్కుల కోసం పోరాడేలా చేయటానికి భాగ్యరెడ్డివర్మ అవిశ్రాంతంగా కృషిచేశారని ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేడ్కర్‌ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణయ్య అన్నారు.  ఆదివారం గండీడ్‌లో ఆయన 134వ జయంతిని పురస్కరించుకొని అంబేడ్కర్‌ విగ్రహం ముందు భాగ్యరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళుల ర్పించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ చంద్రకళ, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి,  పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ లక్ష్మీనారాయణ, డైరెక్టర్‌ వెంకట్‌, టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరి రాములు, మహమ్మదాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కేఎం నారాయణ, సల్కర్‌పేట సర్పంచ్‌ జితేందర్‌రెడ్డి, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు మండల ఆశన్న, బీఎస్సీ మండల అధ్యక్షుడు పసుల శ్రీనివాస్‌, ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు గోవర్ధన్‌, నాయకులు రామచంద్రారెడ్డి, నగేష్‌, బసయ్య, బాలయ్య, భగవంతు, అనీల్‌ పాల్గొన్నారు.    



Updated Date - 2022-05-23T05:20:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising