మెరుగైన వైద్యసేవలు అందించాలి
ABN, First Publish Date - 2022-12-16T22:59:02+05:30
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు.
- కలెక్టర్ శ్రీహర్ష
- జిల్లా కేంద్రంలో చిన్న పిల్లల ఆస్పత్రి తనిఖీ
నారాయణపేట టౌన్, డిసెంబరు 16: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వంద ప డకల చిన్న పిల్లల ఆస్పత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. రోగులతో కలెక్టర్ మాట్లాడి వైద్యులు అందిస్తున్న వై ద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అం దిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తె లుసుకున్నారు. రోజువారి ఓపీల వివరాలను, మందు ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించా రు. ఆస్పత్రిలో ఇంకా వైద్యులు అవసరమున్నట్లు సూ పరింటెండెంట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ వెంట డాక్టర్ రంజిత్, క్రాంతికుమార్, పాల్గొన్నారు.
ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరించాలి
నారాయణపేట టౌన్: ధరణి పోర్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారుల ను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అన్ని మం డలాల తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల పరిధి లోని అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయని ఫారం 6, 7, 8 ఆన్‌లైన్ చేయాలని, రద్దు అయిన ఫామ్ 6 ఫైల్ భద్రంగా ఉంచాలని సూచించారు. ప్రభుత్వ భూములు ఇతరుల పేర్లపై నమోదై ఉంటే వాటిని స రి చేసుకోవాలని, కోర్టు కేసులు ఉంటే వాటిని పరి శీ లించాలని సూచించారు. మీసేవ ద్వారా రైతులు ఫి ర్యాదులు పెట్టుకుంటే వాటిని పరిష్కరించాలని సూ చించారు. ఇప్పటి వరకు ఉన్న టీఎం 33, మ్యుటేషన్, సక్షేషన్‌లను ఒకటికి రెండుసార్లు పరిశీ లించాల న్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పద్మజా రాణి, నాగేందర్, తహసీల్దార్లు దానయ్య పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T22:59:04+05:30 IST