ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరి సహకారంతో కళాశాలకు ఉత్తమ గ్రేడ్‌

ABN, First Publish Date - 2022-08-25T05:17:59+05:30

కళాశాల అలుమినీ కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, కలెక్టర్‌ వల్లూరి క్రాంతి, అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీహర్షల సహకారంతోనే మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉత్తమ గ్రేడ్‌ లభించిందిందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.శ్రీపతినాయుడు అన్నారు.

ప్రిన్సిపాల్‌ను సన్మానిస్తున్న అధ్యాపకులు, సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కృతజ్ఞతలు తెలిపిన ప్రిన్సిపాల్‌ శ్రీపతినాయుడు

గద్వాల టౌన్‌, ఆగస్టు 24 : కళాశాల అలుమినీ కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, కలెక్టర్‌ వల్లూరి క్రాంతి, అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీహర్షల సహకారంతోనే మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉత్తమ గ్రేడ్‌ లభించిందిందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.శ్రీపతినాయుడు అన్నారు. ఇందుకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ప్రిన్సిపాల్‌ అధ్యక్షతన అధ్యాపకులు, సిబ్బందితో బుధవారం నిర్వహించిన సమావేశంలో తీర్మానం ఆమోదించారు. అలుమినీ కమిటీ అధ్యక్షుడిగా భాస్కర్‌ రెడ్డి, సభ్యులు బీఎస్‌ ఆనంద్‌, కే. వెంకటేశ్వరరావు, కృష్ణయ్య, అప్సర్‌ బాషా, బండ్ల రాజశేఖర్‌ రెడ్డి, సంగాల అయ్యపురెడ్డి, ఆలూరు రాముతో పాటు కళాశాల అభివృద్ధికి రూ.15 లక్షలు విడుదల చేసిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థానాదీశుడు రాజాసీతారం భూపాల్‌ విగ్రహ పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసిన అయ్యపురెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. అన్నివిధాల సహకరించిన సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం అధ్యక్షుడు మోహన్‌రావు, న్యాయవాది వెంకటాద్రిరెడ్డి, కౌన్సిలర్‌ త్యాగరాజు, న్యూగంజ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, పూర్వ విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. కళాశాల ‘ఏ’గ్రేడ్‌కు చేరేలా అందరూ కృషి చేయాలని అభ్యర్థించారు. సమావేశంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ లవీన మంజులత, అధ్యాపకులు మనోజ్‌కుమార్‌, శివారెడ్డి, శంకర్‌, ఏవో మక్బూల్‌ అహ్మద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-25T05:17:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising