ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడవి బిడ్డలకు అందని వైద్యం

ABN, First Publish Date - 2022-01-27T05:48:33+05:30

అడవి బిడ్డలకు వైద్యం అం దని ద్రాక్షగా మారింది.

పదర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పేరుకే పీహెచ్‌సీ.. సిబ్బంది లేరేమీ..!

- గత్యంతరం లేక ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్న రోగులు

పదర, జనవరి 26 : అడవి బిడ్డలకు వైద్యం అం దని ద్రాక్షగా మారింది. నల్ల మల అటవీ ప్రాంతంలోని పదర, అమ్రాబాద్‌ మండ లాల్లో సుమారు 30చెంచు పెంటలున్నాయి. పదర మం డలంలోని పెట్రాల్‌చేను, పిల్లిగుండ్లు, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో గీసుగండి ప్రాంత ప్రజలు ప్రతీనిత్యం వైద్యం కోసం తీవ్ర ఇ బ్బందులకు గురవుతూ ఉంటారు. కాగా, పదర మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద పది సబ్‌ సెంటర్లున్నాయి. అయితే, ఇక్కడి పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటం గమనార్హం. ఆసుపత్రి సిబ్బంది కూడా సరైన సమయానికి రావడం లేదని గ్రామస్థులు, యువజన సం ఘాలు, ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఏటా ఆసుపత్రికి వచ్చే నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో కలెక్టర్‌ దృష్టి కేంద్రీకరించాలని పలువురు కోరు తున్నారు. పదిరోజుల నుంచి వరుసగా ‘ఆంధ్రజ్యోతి’ ఆసుపత్రిని పరిశీలి స్తోం ది. సంబంధిత అధికారులను, వైద్యులను ఫోన్‌లో సంప్రదించగా ఒక డాక్టర్‌ జ్వరం వచ్చిందని అందుకే రావడం లేదన్నారు. డ్యూటీ డాక్టర్‌, డిప్యూటీ డీఎం హెచ్‌వో డాక్టర్‌ శ్రీధర్‌ను సంప్రదించగా సిబ్బంది కొరత ఉంది. ఇంత కు ముందు ఉన్న స్టాఫ్‌నర్సులు రెగ్యులరైజేషన్‌ మీద వెళ్లారని తెలిపారు. విసి రేసిన విస్తరిలా ఉన్న చెంచుపెంటల్లోని చెంచులకు కూడా వైద్యమందేలా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలి. 

 చెంచులపై చిన్న చూపు ఎందుకు?

   మా చెంచు గిరిజనులంటే చిన్నచూపే. ముఖ్యంగా ఆస్పత్రుల్లో  అయితే పట్టించుకోరు. అడవిని నమ్ముకొని బతుకుతున్న చెంచులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రతి చెంచు పెంటలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు ఇవ్వాలి. చెంచుల జీవన ప్రమాణ కాలం పెంచాలి. 

- చిగుళ్ల మల్లికార్జున్‌, ఆదివాసి ఐక్య వేదిక జిల్లా కన్వీన్‌

Updated Date - 2022-01-27T05:48:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising