ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలి

ABN, First Publish Date - 2022-07-21T05:24:05+05:30

పోలీసు సిబ్బంది, అధికారులు విధి నిర్వహణలో బాధ్యతతో వ్యవహరిస్తూ, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌ అన్నారు.

ధరూరు పోలీస్‌స్టేషన్లో అధికారులతో మాట్లాడుతున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

ధరూరు, జూలై 20 : పోలీసు సిబ్బంది, అధికారులు విధి నిర్వహణలో బాధ్యతతో వ్యవహరిస్తూ, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని  ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన ధరూరు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో వాహనాల పార్కింగ్‌ స్థలాన్ని పరిశీలించారు. స్టేషన్‌ రైటర్‌, షీటీమ్స్‌ పని తీరు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. జనరల్‌ డైరీ, సుపీరియర్‌ ఆఫీస్‌ బుక్స్‌, ఫైనల్‌ రిపోర్టు తదితర రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని ఎస్‌ఐ శేఖర్‌రెడ్డికి సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని అమలు చేయాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని చెప్పారు. నేరాల విచారణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. ఎస్పీ వెంట సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ శేఖర్‌ రెడ్డి, సీసీ రోహిత్‌కుమార్‌ ఉన్నారు. 


Updated Date - 2022-07-21T05:24:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising