ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హార్వెస్టర్‌కు దుండగుల నిప్పు

ABN, First Publish Date - 2022-07-26T05:29:57+05:30

ధరూరు మండలంలోని నీలహల్లి గ్రామంలో సోమవారు తెల్లవారుజామున బోయ హనుమంతు పొలం వద్ద ఉన్న హార్వెస్టర్‌కు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు.

నీలహల్లి గ్రామంలో నిప్పంటుకున్న హార్వెస్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే  

- రూ.30 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు వెల్లడి 

ధరూరు, జూలై 25 :  ధరూరు మండలంలోని నీలహల్లి గ్రామంలో సోమవారు తెల్లవారుజామున బోయ హనుమంతు పొలం వద్ద ఉన్న హార్వెస్టర్‌కు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. దీంతో రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అం దుకున్న ధరూరు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి, కేటీదొడ్డి ఎస్‌ఐ కురుమయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేవవరు. గద్వాల ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్‌ రెడ్డి హార్వెస్టర్‌ను పరిశీలించి, బాధితుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అలజడులు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. దుండగులు ఎంతటి వారైనా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.  ఎమ్మెల్యే వెంట ఎంపీపీ విజయ్‌, ఎంపీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌ రెడ్డి, నాయకులు జాకీర్‌, జంబు రామన్‌గౌడ్‌ ఉన్నారు.  

Updated Date - 2022-07-26T05:29:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising