ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వజ్రోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

ABN, First Publish Date - 2022-08-07T05:08:06+05:30

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపఽథ్యంలో జిల్లా లో నిర్వహించనున్న వజ్రోత్సవాలు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులకు ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీహర్ష
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ శ్రీహర్ష

 గద్వాల క్రైం, ఆగస్టు 6 : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపఽథ్యంలో జిల్లా లో నిర్వహించనున్న వజ్రోత్సవాలు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశపు హాలులో జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమావే శాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ భారత  వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఆగస్టు 8నుంచి ఆగస్టు 21 వరకు ప్రభుత్వ సూచనల మేరకు కార్యక్రమాలను అమలు చేయాలని కలెక్టర్‌  ఆదేశించారు. ఆగస్టు 8న ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లో వజ్రోత్సవ వేడుకలను ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జడ్పీటీసీ సభ్యులకు, ఎంపీపీలకు రేపు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా నుంచి ప్రత్యేక వాహనం ద్వారా వెళ్లాలని, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జడ్పీ సీఈవో, జిల్లా రవాణా అధికారి చూడాలన్నారు. ఇంటింటి జాతీయ పతాకం ఎగుర వేసే దిశగా ప్రతీ ఇంటికి జాతీయ జెండా పంపిణీ  కార్యక్రమాన్ని మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.   ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి వివిధ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా అఽధికారులు పాల్గొన్నారు.  

జంతు జనన నియంత్రణ కేంద్రం ప్రారంభం

గద్వాల: కొన్ని జంతువులు సంఖ్య పెరిగి ప్రజల కు ఇబ్బందులు కలిగిస్తున్నాయని వాటిని నియం త్రణ చేసేందుకు జంతు జనన నియంత్రణ కేంద్రా న్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ శ్రీహర్ష, ఎమ్మె ల్యే బం డ్ల కృష్ణమోహన్‌ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా వెటర్నరీ కార్యాలయ ఆవరణలో రూ. 35లక్షలతో ని ర్మించిన కేంద్రాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్వాల పట్టణంలో కుక్కలు, కోతుల బెడద రోజు రోజుకు పెరిగి ప్రజలకు ఇబ్బం దులు కలిగిస్తున్నాయని వివ రించారు. వాటి వలన చాలా మంది ఆస్పత్రి పాలు అయ్యాయరన్నారు. వీటి యొక్క జననను నియంత్రించేందుకు పురపా లక సంస్థ, వెటర్నరీ సమన్వయంతో ఈ కేంద్రాన్ని  ప్రారంభిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఎక్కడైన కుక్కల బెడద, కోతుల బెడద ఉండి ఇబ్బందులు ప డుతుంటే మునిసిపల్‌ సిబ్బంది లేదా టోల్‌ ఫ్రీ నెం బర్లకు ఫోన్‌ చేసి ఫిర్యా దులు చేయాలని వారు కో రారు. సిబ్బంది వాటిని తీసుకవచ్చి జనన ని యంత్రణ సర్జరీలు చేస్తారని వివరించారు.  కార్యక్ర మంలో జిల్లా వెటర్నీ అధికారి వెంకటేశ్వర్లు, మునిసి పల్‌ కమిషనర్‌ జానకిరామ్‌ సాగర్‌  పాల్గొన్నారు.

Updated Date - 2022-08-07T05:08:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising