ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రావతరణ దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి

ABN, First Publish Date - 2022-06-01T05:39:39+05:30

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎ. సీతారామారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), మే 31 : రాష్ట్ర అవతరణ దినోత్సవ  వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు అన్నారు. మంగళవారం ఆయన తన చాంబర్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జూన్‌ 2 రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ ముందుగా ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారని, ఉదయం 9 గంట లకు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, పోలీసు గౌరవవందనం స్వీకరిస్తారని ఆయన తెలిపారు. అనంతరం మంత్రి సందేశం, సాంస్కృతిక కార్యక్ర మాలు, ఆయాశాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్ల సందర్శన ఉంటుందని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో తెలంగాణ స్ఫూర్తిపై కవి సమ్మేలనం ఉంటుందని, సాహితీవేత్తలు, అధికారులతో ఏర్పాటు చేసిన సాహిత్య కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన కవులకు సన్మానం ఉంటుందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దినో త్సవానికి ఆయా శాఖల అధికారులు వారి వారి శాఖల తరపున అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేడుకలు నిర్వహించే పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో అవ సరమైన తాగునీరు, టెంట్లు, ఆహూతులకు కుర్చీలు తదితర ఏర్పాట్లు చేయాలని సూచించా రు. ఆర్డీవో అనిల్‌ కుమార్‌, ఆయా శాఖల జిల్లా అధికారులు సమావేశానికి హాజరయ్యారు.

Updated Date - 2022-06-01T05:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising