ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల టీఏకు ఆమోదం

ABN, First Publish Date - 2022-01-22T05:24:32+05:30

విద్యాహక్కు చట్టానికి అనుగుణంగా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 121 ఆవాసాలకు ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేక పోవడంతో విద్యార్థులు ఒక కి.మీ. నుంచి ఐదు కి.మీ. దూరం వరకు నిత్యం రాకపోకలు కొనసాగించే వారికి ఊరటనిచ్చేలా ప్రభుత్వం రవాణ భత్యం మంజూరు చేసింది.

మందిపల్లి తండా నుంచి పాఠశాలకు వస్తున్న విద్యార్థులు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- విద్యార్థుల ఖాతాల్లో నేరుగా నిధుల జమ

- పేట జిల్లాలో 2028 మందికి లబ్ధి

- ఖాతాలు సమర్పించకుంటే భత్యం వెనక్కి..


నారాయణపేట, జనవరి 21: విద్యాహక్కు చట్టానికి అనుగుణంగా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 121 ఆవాసాలకు ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేక పోవడంతో విద్యార్థులు ఒక కి.మీ. నుంచి ఐదు కి.మీ. దూరం వరకు నిత్యం రాకపోకలు కొనసాగించే వారికి ఊరటనిచ్చేలా ప్రభుత్వం రవాణ భత్యం మంజూరు చేసింది. అయితే, జిల్లా వ్యాప్తంగా పీఎస్‌, యూపీఎస్‌ పరిధిలో 723 మంది విద్యార్థులకు, ఉన్నత పాఠశాలల పరిధిలో 1,305 మంది విద్యార్థులకు ఇలా మొత్తం 2,028 మంది విద్యార్థులకు ఐదు నెలలు సెప్టెంబరు నుంచి జనవరి వరకు రవాణా భత్యం రూ.60.84 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో విద్యార్థులు అధిక మొత్తంలో బ్యాంకు ఖాతాలను సమర్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో రవాణ భత్యం విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడంలో ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదు. తక్షణమే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులతో బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేలా బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకొని బ్యాంకు ఖాతాలతో పాటు, వారి హాజరును చైల్డ్‌ ఇన్‌ఫోలో అప్‌డేట్‌ చేస్తేనే విద్యార్థుల ఖాతాల్లో రవాణా భత్యం జమ అవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, బ్యాంకు మేనేజర్లు చొరవ తీసుకొని విద్యార్థులకు రవాణ భత్యం అందించేందుకు తమవంతు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసర మెంతైనా ఉంది. రవాణ భత్యం విషయానికి వస్తే ప్రాథమిక పాఠశాల కి.మీ. పరిధి దూరంలో ఉంటే ఏడాదికి రూ.4వేలు, యూపీఎస్‌ 3 కి.మీ. పరిధి దూరంలో ఉంటే ఏడాదికి రూ.6వేలు, ఉన్నత పాఠశాల 5 కి.మీ. దూరంలో ఉంటే ఏడాదికి రూ.6వేలు చెల్లిస్తుంది. రవాణ భత్యంకు సంబందించి జీఓ 61 ద్వారా ఆమోదం పలకగా అక్టోబరు 18, 2021న 3380 సర్క్యులర్‌ ప్రకారం విద్యాశాఖ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఇదిలా ఉండగా, విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు పాన్‌కార్డు లింక్‌ పెట్టకుండా బ్యాంకు మేనేజర్లు ఖాతాలను విద్యార్థుల పేరిట తెరిచేలా చర్యలు తీసుకుంటే ఎంతోమేలు చేకూరుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - 2022-01-22T05:24:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising