ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరణిలో తప్పుల సవరణకు మరో మాడ్యూల్‌

ABN, First Publish Date - 2022-07-02T05:36:44+05:30

రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో కొత్తగా టీఎం - 33 పేరుతో మరో మాడ్యూల్‌ను ఇచ్చిందని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు తెలిపారు.

సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- టీఎం - 33 పేరుతో మరో మాడ్యూల్‌

- దీని ద్వారా కలెక్టర్లకు 12 రకాల ఆప్షన్లు

- దీనిపై నియమించిన ఐదు బృందాలకు శిక్షణ ఇచ్చిన కలెక్టర్‌

మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), జూలై 1 : రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో కొత్తగా టీఎం - 33 పేరుతో మరో మాడ్యూల్‌ను ఇచ్చిందని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు తెలిపారు. టీఎం - 33 పేరుతో ఇచ్చిన ఈ మాడ్యూల్‌ ద్వారా 12 రకాల ఆప్షన్లు జిల్లా కలెక్టర్లకు ఇచ్చిందని అన్నారు. ఈ మాడ్యూల్‌పై జనరేట్‌ చేసే అంశాలపై  శుక్రవారం ఆయన తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంతో పాటు ఈ మాడ్యూల్‌పై నియమించిన ప్రత్యేక బృందాలకు కలెక్టర్‌ స్వయంగా శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ టీఎం - 33 మాడ్యూల్‌ అమలు కోసం కలెక్టరేట్‌లో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సర్వే నంబర్ల వారీగా ఉన్న భూములు, ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎండోమెంట్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు ఇచ్చిన భూమా అన్నది తెలుసుకోనున్నట్లు చెప్పారు. అంతేకాకా పట్టా పాస్‌ పుస్తకాలలో రెండవ పేజీలో ఉన్న తప్పులను పరిశీలించి సవరించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం ఈ మాడ్యూల్‌ ద్వారా కల్పించినట్లు కలెక్టర్‌ తెలిపారు. పూర్తి స్థాయిలో సిబ్బంది శిక్షణ పొందిన తర్వాత 15 రోజుల అనంతరం కలెక్టర్‌ లాగిన్‌లో పూర్తి స్థాయిలో పరిశీలించిన మీదట ఆమోదించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, సెక్షన్ల సూపరింటెండెట్లు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T05:36:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising