నిజాయతీ చాటుకున్న ప్రయాణికుడు
ABN, First Publish Date - 2022-12-07T23:10:19+05:30
ఓ బస్సులో ప్రయాణికుడు బంగారు వస్తువులను బాధితునికి అందజేసి తన నిజాయతీ చాటుకున్నాడు.
అడ్డాకుల, డిసెంబరు 7 : ఓ బస్సులో ప్రయాణికుడు బంగారు వస్తువులను బాధితునికి అందజేసి తన నిజాయతీ చాటుకున్నాడు. అడ్డాకుల పోలీస్‌స్టేషన్‌లో జరిగిన సంఘట నకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన వంశీకృష్ణ గద్వాల డిపో బస్సులో జడ్చర్ల నుంచి పె బ్బేరుకు వెళుతూ అడ్డాకుల దగ్గర తన బ్యాగ్‌స్థానంలో ఇంకో బ్యాగ్ ఉండడం గమనించాడు. బ్యాగ్ తెరిచి చూసి అందులో రూ.1.5 లక్షల విలువైన రెండున్నర తులాల బంగారు నెక్లెస్ ఉండడంతో బ్యాగును ఎవరో పోగుట్టుకున్నారని గ్రహించి అడ్డాకుల పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ విజయ కుమార్‌కు అంద జేశారు. కాగా పోలీసులు పొన్నకల్ స్టేజీ దగ్గర గల సీసీ కెమెరాలు పరిశీలించి రాచాలకు చెందిన చింతనూరు నాగరా జుకు చెందినదిగా తెలుసుకొని అతనికి అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు తోటి ప్రయాణికుడు వంశీకృష్ణను అభినందించారు
Updated Date - 2022-12-07T23:10:22+05:30 IST