ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘భారత్‌ జోడో’కు అద్భుత స్పందన

ABN, First Publish Date - 2022-10-18T04:26:47+05:30

‘కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశాన్ని మతపరంగా విభజించి, విధ్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని చేసే ప్రయత్నాలు దేశానికి మంచివి కావు. భారత సమాజంలో అందరూ ప్రేమాభిమానాలతో కలిసి ఉండాలని, విద్వేషాలు విడనాడాలని చేస్తున్న రాహుల్‌ చేస్తున్న భారత్‌ జోడో పాదయాత్రకు అన్ని రాష్ట్రాల్లో అద్భుత స్పందన వస్తోంది’ అని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అందుకే రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రను చేపట్టారని చెప్పారు.

విలేకరులతో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశహితం కోరి చేస్తున్న గొప్ప యాత్ర

టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


మహబూబ్‌నగర్‌, అక్టోబరు 17: ‘కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశాన్ని మతపరంగా విభజించి, విధ్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని చేసే ప్రయత్నాలు దేశానికి మంచివి కావు. భారత సమాజంలో అందరూ ప్రేమాభిమానాలతో కలిసి ఉండాలని, విద్వేషాలు విడనాడాలని చేస్తున్న రాహుల్‌ చేస్తున్న భారత్‌ జోడో పాదయాత్రకు అన్ని రాష్ట్రాల్లో అద్భుత స్పందన వస్తోంది’ అని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అందుకే రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రను చేపట్టారని చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు భారత్‌ జోడో జాతీయ కోఆర్డినేటర్‌గా ఉన్న ఉత్తమ్‌ సోమవారం మంత్రాలయం వెళ్తూ, మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశ, సమాజ హితం కోసం చేస్తున్న గొప్ప యాత్రగా ఇది ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాహుల్‌ ఆయా రాష్ట్రాల సమస్యలను దారిపొడవునా ప్రజలతో మాట్లాడి తెలుసుకుంటారని తెలిపారు. సామాన్య ప్రజలను కలుస్తూ ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను తెలుసుకుంటారని, ఆ సమస్యలపై కాంగ్రెస్‌ పోరాడుతుందని చెప్పారు. ప్రజలకు యాత్రలో భరోసా, ఓదార్పు ఇస్తున్నారని వివరించారు. ప్రజల సమస్యలను అధికారంలోకి రాగానే చేస్తామనే హామీ ఇస్తున్నారన్నారు. యాత్రలో ఎక్కువ సమయంలో రాహుల్‌ కంటైనర్‌లోనే ఉంటారని, చాలా సాధారణ జీవితం గడుపుతున్నారని పేర్కొన్నారు. దేశంలో పంట బీమా పథకం లేని రాష్ట్రం ఈ ముదనష్టపు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే ఉందని దుయ్యబట్టారు. వీటన్నింటిని రాహుల్‌కు  వివరిస్తామని చెప్పారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌, నాయకులు హర్షవర్ధన్‌రెడ్డి, వినోద్‌కుమార్‌, చిట్టెం అభ్యుదయ్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌గౌడ్‌, కొండాప్రశాంత్‌రెడ్డి, బెక్కరి అనిత, సంజీవ్‌ముదిరాజ్‌, చంద్రకుమార్‌గౌడ్‌, సీజే బెనహర్‌, లక్ష్మణ్‌యాదవ్‌, బెక్కరి మధు, రాముల్‌యాదవ్‌, అవేజ్‌, హక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T04:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising