మీసేవ కేంద్రాల్లో అధిక వసూళ్లు చేస్తే చర్యలు
ABN, First Publish Date - 2022-12-16T22:46:47+05:30
జిల్లాలో అధిక వసూళ్లుకు పాల్పడుతున్నట్లు నిర్దారణ అయిన 16 మీసేవ కేంద్రాలపై చర్యలు తీసుకుంటున్నట్లు అద నపు కలెక్టర్ మోతీలాల్ తెలిపారు.
- అదనపు కలెక్టర్ మోతీలాల్
నాగర్కర్నూల్ టౌన్, డిసెంబరు 16: జిల్లాలో అధిక వసూళ్లుకు పాల్పడుతున్నట్లు నిర్దారణ అయిన 16 మీసేవ కేంద్రాలపై చర్యలు తీసుకుంటున్నట్లు అద నపు కలెక్టర్ మోతీలాల్ తెలిపారు. శుక్రవారం కలెక్టరే ట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని 134 మీ సేవ కేంద్రాల నిర్వాహకులతో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా పని చేయాల్సిన మీసేవ కేంద్రాలు నిబంధనలు అతిక్రమించి రైతుల నుంచి అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆరు గురు సభ్యులతో కూడిన మూడు టీమ్లు ఏర్పడి రైతు ల్లా మారువేశంలో జిల్లాలోని మీసేవ కేంద్రాలను తని ఖీ చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా 16 మీసేవ కేంద్రాల నిర్వాహకులు అధిక వసూళ్లకు పాల్పడుతున్న ట్లు నిర్దారణ అయ్యిందని పేర్కొ న్నారు. జిల్లాలో 26 మీసేవా కేంద్రాల జీరో నమోదు కార్య క్రమాలు చేపడుతున్నాయన్నారు. కొన్ని కేంద్రాలు తప్పుడు ధ్రువ పత్రాలను సమర్పించి అధిక వ సూళ్లకు పాల్పడుతున్నట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. మీసేవ కేంద్రాలు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మీసేవ సూపరింటెండెంట్ బాలరాజు, జిల్లా మేనేజరు నరేష్, టీఎస్ఎస్ శ్రీనివాస్, టీఎస్ ఆన్లైన్ రాము, మీసేవ కేంద్రాల నిర్వాహకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T22:46:48+05:30 IST