ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN, First Publish Date - 2022-03-06T04:56:38+05:30

వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో రాంమనోహర్‌రావు పేర్కొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి నాయకులతో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఆలస్యంగా విధులకు హాజరైన సిబ్బందిపై మండిపాటు

- డీఎంహెచ్‌వో రాంమనోహర్‌రావు 

- దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

దామరగిద్ద, మార్చి 5 : వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో రాంమనోహర్‌రావు పేర్కొన్నారు. శనివారం దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, విధులకు ఆలస్యంగా హాజరైన డాక్టర్‌ రవీందర్‌తో పాటు సిబ్బందిపై మండిపడ్డారు. డాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, డాక్టర్‌ ఆసుపత్రితో అందుబా టులో లేని కారణంగా రోగులు రావడం లేదన్నారు. మండల కేంద్రంలో ఆస్పత్రి ఉన్నా రోగులకు సరైన వైద్యం అందడం లేదని ఎంపీపీ నర్సప్ప, విండో అధ్యక్షుడు పుట్టి ఈదప్ప ఆరోపించారు. ఇదిలా ఉండగా పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నా రని, ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సెలవు రోజుల్లో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వర కు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. పాటించాల్సిన సమయం కన్న ఐదు నిమిషాలు ముందు గా సేవలు నిలిపివేసినా చర్యలు తప్పవన్నారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. రికార్డుల్లో క్లుప్తమైన సమాచారం ఉండాలని సిబ్బందికి సూచించారు.  ఇక నుంచి డాక్టర్‌ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే తమకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. 



Updated Date - 2022-03-06T04:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising