భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య
ABN, First Publish Date - 2022-12-07T22:35:48+05:30
భర్త అంత్యక్రియలు జరుపకుండా భార్య అడ్డుకున్న సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మం డలంలోని మాదారం గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది.
- భర్త భూమికి నామినీగా ఆడపడుచు
ఊర్కొండ, డిసెంబరు 7 : భర్త అంత్యక్రియలు జరుపకుండా భార్య అడ్డుకున్న సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మం డలంలోని మాదారం గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన సమాచారం మేరకు వివరా లు ఈ విధంగా ఉన్నాయి. మాదారం గ్రామానికి చెందిన అంకూ రి ఇస్తారి (45) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో కొంత కా లంగా తల్లిగారి ఇంట్లో ఉంటున్న భార్య పార్వతమ్మ, ఆమె బం ధువులు మృతుడి పేర ఉన్న భూమి పట్టా పాస్‌బుక్ ఎక్కడని ప్రశ్నించడంతో పాటు భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని తమకు దక్కాల్సిన 20 గుంటల భూమిని ఆడపడుచులు పట్టా చేసుకున్నారని, ఎకరం అసైన్డ్ (ప్రభుత్వ) భూమిని మాత్రమే త న భర్త పేర ఉంచడం ఎంత వరకు సమంజసమని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, ఆర్థిక పరి స్థితి బాగోలేకపోవడంతో పిల్లలను చదువుకు దూరం చేసి కూలీ పనులు చేసి జీవిస్తున్నట్లు భార్య ఆవేదన వ్యక్తంచేశారు. భర్త చ నిపోవడంతో రైతుబీమా రావాల్సిన చోట నామినీగా ఆడపడుచు పేరు పేర్కొనడం ఏంటని ఆమె భర్త అంత్యక్రియలను అడ్డుకు న్నది. ఆడపడుచు తమ పేర చేసుకున్న భూమి, రైతుబీమా తనకు వచ్చే విధంగా చేస్తే తప్ప అంత్యక్రియలు జరుపనివ్వబో మని భార్య, బంధువులు అడ్డుకోవడంతో ఆడపడుచులు వారి పిల్లలు పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు చేరు కొని ఇరు కుటుంబాల వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకు న్నారు. అంత్యక్రియలు ఆగిపోయాయి.
Updated Date - 2022-12-07T22:35:49+05:30 IST