ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొగులయ్యకు అరుదైన గౌరవం

ABN, First Publish Date - 2022-01-26T06:14:03+05:30

కేంద్ర ప్రభు త్వం గణతంత్య్ర దినోత్స వాన్ని పురస్కరించుకొని కళల విభాగంలో కిన్నెర కళాకారుడు నల్ల మల ముద్దుబిడ్డ దర్శన మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.

మొగులయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కిన్నెర కళను వరించిన పద్మశ్రీ అవార్డు

- జానపద పాటలతో చరిత్రను వివరిస్తున్న మొగులయ్య

- తెలంగాణ కిన్నెర కీర్తి దేశవిదేశాలకు వ్యాప్తి

- ‘భీమ్లానాయక్‌’ సినిమా పాటతో ప్రత్యేక గుర్తింపు

లింగాల/అచ్చంపేట, జనవరి 25:  కేంద్ర ప్రభు త్వం గణతంత్య్ర దినోత్స వాన్ని పురస్కరించుకొని   కళల విభాగంలో కిన్నెర కళాకారుడు నల్ల మల ముద్దుబిడ్డ దర్శన మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు  ప్రకటించింది. కుటుంబ పోషణ కోసం తండ్రి నేర్పిన కిన్నెర జానపద పాటలే ఇటు తెలంగాణ రాష్ట్రం ఉగాది పురస్కారాన్ని అందజేసింది. మొగుల య్య  భీమ్లానాయక్‌ సినిమాలో పాడిన పాట తెలుగురాష్ర్టాల అభిమానులను ఆకట్టుకున్నది. 

 మొదటి గురువు తండ్రే 

తన మొదటి గురువు తండ్రి ఎల్లయ్యనే అని మొగులయ్య చెబుతూ ఉంటాడు. ఎల్లయ్య దంపతులకు మొగులయ్య మొదటి సంతానం. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంట ఆయన సొంత గ్రామం. తండ్రి ఏడు మెట్ల కిన్నెరతో ఈ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా జనపదాలలో ఆలపించే వాడు. తండ్రి మరణానంతంరం మొగుల య్య కుటుంబ పోషణ కోసం కిన్నెరనే వృత్తిగా ఎంచుకున్నాడు. పాటలు పాడుతూ పలువు రి మన్ననలు పొందుతున్నాడు. మొగుల య్యకు భార్య శంకరమ్మ, ముగ్గురు కుమారు లు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన కు మారులు ఇక్కడ జీవనోపాధి లేక  హైదరా బాదులో కూలీ పనులు చేసుకుంటూ జీవ నం కొనసాగిస్తున్నారు.  భార్య మృతి చెంద డంతో మొగులయ్య కూడా కుమా రులతో పాటు హైదరాబాదులో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మొగులయ్య 12 మెట్ల కిన్నెరను వాయిస్తూ పండగసాయన్న వీరగాధ, పిల్లా జాతరపోదం పిల్ల, మీయాసబ్‌ చరిత్ర, సంపన్నులను దోచి పేదవాడికి పంచిపెట్టె ఉదంతాల పాటలను ప్రజలకు వివరిస్తున్నాడు.  


Updated Date - 2022-01-26T06:14:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising