ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ సంస్థ మనుగడకు పని చేయాలి

ABN, First Publish Date - 2022-08-12T05:13:23+05:30

టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ విద్యుత్‌ సంస్థ మనుగడకు సిబ్బంది శక్తివంచనలేకుండా పనిచేయాలని డైరెక్టర్‌ జె.శ్రీనివాసరెడ్డి పిలుపుని చ్చారు.

విద్యుత్‌ అధికారుల సమీక్షలో మాట్లాడుతున్న డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ జె.శ్రీనివాసరెడ్డి

పాలమూరు, ఆగస్టు 11 : టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ విద్యుత్‌ సంస్థ మనుగడకు సిబ్బంది శక్తివంచనలేకుండా పనిచేయాలని డైరెక్టర్‌ జె.శ్రీనివాసరెడ్డి పిలుపుని చ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఉమ్మడి జిల్లా విద్యుత్‌ సిబ్బందితో సమీ క్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డైరెక్టర్లు రాములు, మదన్‌ మోహన్‌లతో కలిసి ఆయన హాజరయ్యారు. రెండేళ్ల ఐదు నెలలు (29 నెలల తరువాత) ఏర్పాటు చేసిన భౌతిక సమీక్ష సమావేశం ప్రత్యేకత సంతరించు కుంది. ఇంతకాలం కరోనా ప్రభావంతో ఆన్‌లైన్‌ సమీక్ష నిర్వహించారు. సుమా రు అరగంటకు పైగా అధికారులను నిలబెట్టి చీవాట్లు పెట్టారు. రెవెన్యూ కలెక్ష న్స్‌, బిల్లింగ్‌, సీఎస్‌సీ ఫెర్‌ఫార్మెన్స్‌, ఎనర్జీ అచీవ్‌మెంట్‌, యూడీసీ ఏరియర్స్‌ను ముక్కుపిండి వసూలు చేయాల్సిందేన న్నారు. లేకపోతే సరెండర్‌ చేసి జిల్లా మార్పిడి చేస్తామని హెచ్చరించారు. డైరెక్టర్‌ స్థాయిలోని అధికారి అన్నగా, తండ్రిగా సిబ్బందికి అప్పీల్‌ చేయటం, చివరికి దండంపెట్టి చెప్పటం విశేషం. సిబ్బంది శక్తివంచనలేకుండా పనిచేయకపోతే సంస్థకు మనుగడలేదని హెచ్చ రించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ ఎన్‌.ఎస్‌.ఆర్‌ మూర్తి, డీఈటీ డి.చంద్రమౌళి, సంజీవరెడ్డి, డీఈలు, ఉమ్మడి జిల్లాలోని ఏడీలు, ఏఈలు, ఇతర సిబ్బంది అధికసంఖ్యలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T05:13:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising