ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలమూరులో అర్ధరాత్రి భారీ చోరీ

ABN, First Publish Date - 2022-12-06T23:23:52+05:30

శుభకార్యానికి వెళితే దొంగలు ఇంట్లో దూరి అందిన కా డికి దోచుకెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 28 తులాల బంగారు నగలు

- రూ.70 వేల నగదు, స్కూటీ అపహరణ

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 6: శుభకార్యానికి వెళితే దొంగలు ఇంట్లో దూరి అందిన కా డికి దోచుకెళ్లారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని జగ్జీవన్‌ రామ్‌నగర్‌కు చెందిన రిటైర్డు ఉద్యోగి కృష్ణయ్య రెండురోజుల క్రితం కుటుంబీకులతో కలిసి ఓ శుభకార్యం నిమిత్తం ఊరికి వెళ్లారు. మంగళవారం ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళా లు తీసి ఉండడంతో ఖంగుతున్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తీసి ఉండడం, వస్తువు లన్నీ చిందరవందరగా పడి ఉండడంతో దొంగతనం జరిగిందని భావించి టూటౌన్‌ పోలీసు లకు సమాచారం అందించారు. బీరువా లాకర్‌లో చూడగా దాదాపు 28 తులాల బంగారు నగలు, రూ.70 వేలు కనిపించలేదు. బీరువాలో మరోవైపు రూ.2లక్షల నగదు ఉన్నా దొంగలు వాటిని గమనించలేదు. టూటౌన్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తీసుకున్నారు. క్లూస్‌టీమ్‌తో వివరాలు సేకరించారు. కింద పార్క్‌ చేసిన స్కూటీ కూడా దొం గలు ఎత్తుకెళ్లారు. నగలు తాకట్టు పెట్టి ప్లాట్‌ కొనేందుకు డబ్బులు సమకూర్చుకొని ఇంట్లో పెట్టి ఊరెళ్లగా దొంగలు ఎత్తుకెళ్లారని బాధితులు వాపోయారు. కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-06T23:23:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising