ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇష్టపడి చదివితే ఉద్యోగం సాధించవచ్చు

ABN, First Publish Date - 2022-06-26T05:08:35+05:30

ప్రణాళిక బద్ధంగా ఇష్టపడి, కష్టపడి చదివితే గ్రూప్‌ ఉద్యోగాలు సాధించడం సులభమేనని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి అన్నారు.

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న పార్థసారథి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- తానూ ప్రభుత్వ పాఠశాలలో చదివే ఐఏఎస్‌నయ్యా

-  గ్రూప్‌ ఉద్యోగ అభ్యర్థుల ప్రేరణా తరగతుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, జూన్‌ 25 : ప్రణాళిక బద్ధంగా ఇష్టపడి, కష్టపడి చదివితే గ్రూప్‌ ఉద్యోగాలు సాధించడం సులభమేనని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్‌ ఫంక్షన్‌ హాలులో వివిధ గ్రూప్‌ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ప్రేరణ తరగతులకు ముఖ్యఅతిఽథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ గ్రూప్స్‌ ఉద్యోగాలతో పాటు, పోలీస్‌, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలను పెద్దఎత్తున భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేసిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఎనిమిదేళ్ల తర్వాత మొదటి సారిగా ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల జాతర ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని యువత ఎలాగైనా ఉద్యోగాలు సాధించాలన్న తపన, కసి, పట్టుదలతో చదవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణఏర్పాటు ఏర్పాటు చేసిందన్నారు. ఎన్నికలు కమిషనర్‌గా ఉంటూనే తన వంతుగా జిల్లాలు తిరుగుతూ యువతకు పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో తెలియజేస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నట్లు తెలిపారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివి ఉద్యోగం సాధించి ఐఏఎస్‌ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెంకట్‌రావు, అదనపు కలెక్టర్‌ సీతారామారావు మాట్లాడారు. ఈ సమావేశంలో  అదనపు ఎస్పీ రాములు,  డీఈవో ఉషారాణి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి శంకరాచారి, సోషల్‌ వెల్పేర్‌ అధికారి యాదయ్య, బీసీడబ్ల్యువో ఇందిరా, ట్రైబల్‌ వెల్పేర్‌ అఽధికారి ఛత్రునాయక్‌ హజరైయ్యారు . అంతకుముందు రోడ్లుభవనాల అతిథి గృహంలో అయన పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెంకట్‌రావు, డీపీఆర్‌వో కె. వెంకటేశ్వర్లు శాలువాతో సత్కరించారు.

Updated Date - 2022-06-26T05:08:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising