ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ABN, First Publish Date - 2022-09-12T05:17:00+05:30

తెలంగాణ మహిళా సాహిత్య, సాం స్కృతిక సంస్థ ఆధ్వర్యంలో పలువురు కవులు, కళాకారులు, ఉపాధ్యాయులను సత్కరించా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, సెప్టెంబరు 11 : తెలంగాణ మహిళా సాహిత్య, సాం స్కృతిక సంస్థ ఆధ్వర్యంలో పలువురు కవులు, కళాకారులు, ఉపాధ్యాయులను సత్కరించా రు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్‌ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ సాహిత్య సంస్థల అధ్యక్షుడు రావురి వనజ, ఉపాధ్యక్షులు చుక్కాయపల్లి శ్రీదేవి, కార్యదర్శి జి.శాంతారెడ్డి పాల్గొని ఉపాధ్యాయులను, కాళోజీ సాహితీ పురస్కారం పొందిన పాకాల యశోధరెడ్డి, వసంత, రాచలపల్లి బాబు, దేవిదాస్‌, జొన్నాడ జానకమ్మతో పాటు ప్రైవేట్‌ పాఠశాలల్లో పని చేసిన పదమూడు మంది ఉపాధ్యాయులను శాలువా, జ్ఞాపికలు, నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ నల్లవోలు నర్సిం హారెడ్డి, సాహిత్య అకాడమీ కార్యదర్శి, అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి, డీఈ వో రవీందర్‌, రిటైర్డ్‌ డీఈవో  విజయకుమార్‌, లక్ష్మణ్‌, రావురి సూర్యనారాయణ,  కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


పాలమూరులో ఉద్రిక్తత


- తీన్మార్‌ మల్లన్న బృందంపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల దాడి

- సొమ్మసిల్లిన కార్యకర్త సుదర్శన్‌

- సమావేశానికి హాజరుకాని తీన్మార్‌ మల్లన్న 


మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 11 : పాలమూరులో ఆదివారం నిర్వహించిన తీన్మార్‌ మల్లన్న సమావేశంపై టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు దాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లా కేంద్రం సమీపంలోని బండమీదిపల్లి హరహర ఫంక్షన్‌ హాలులో తీన్మా ర్‌ మల్లన్న బృందం ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహించింది. సమావేశం ప్రారంభం కాగా నే మహబూబ్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందో ళనకు దిగారు. పాలమూరులో ఇప్పటికీ వలసలు ఆగలేదని చర్చ ప్రారంభం కాగానే పాల మూరులో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంటే కావాలని దుష్ప్రచారం చేసేందుకు చర్చావేదిక  పెట్టడం సరికాదు అంటూ గొడవకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మల్లన్న టీం సభ్యుడు సుదర్శన్‌పై దాడి చేయగా ఆయన సొమ్మసిల్లడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు పెద్దసంఖ్యలో  అక్కడికి చేరుకొని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీచార్జి చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా బయటికి పంపించారు. సమావేశానికి మల్లన్న కూడా హాజరుకాకపోవటంతో సభను ముగించటంతో వివాదం సుద్దుమణిగింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతుగా టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, కార్యకర్తలు నినాదాలు చేశారు. 

Updated Date - 2022-09-12T05:17:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising