వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి
ABN, First Publish Date - 2022-08-05T04:53:02+05:30
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు.
- మాజీ మంత్రి చిన్నారెడ్డి
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, ఆగస్టు 4: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలో గురువారం ఆయన పా ల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ చేసే కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్ధతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాదిగ వీఆర్ వోల సంఘం రాష్ట్ర జేఏసీ కార్యదర్శి బచ్చలకూర పరమేశ్వర్, నాయకులు గంధం లక్ష్మయ్య మాదిగ, కాటేపాగ హుస్సేన్‌మాదిగ, కొమ్ము రాములుమాదిగ, ఎడవల్లి భాస్కర్, బాలరాజు మాదిగ, గంధం సుమన్‌మాదిగ, సిరిగిరి వీరేష్, మిద్దె నాగేష్‌మాదిగ, ఎడవల్లి శివకుమార్, సహ దేవుడుమాదిగ పాల్గొన్నారు.
Updated Date - 2022-08-05T04:53:02+05:30 IST