ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కంటి వెలుగు’కు 25 బృందాలు

ABN, First Publish Date - 2022-12-06T22:59:03+05:30

జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం నర్వహణకు 25 బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వల్లూరు క్రాంతి తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

గద్వాల క్రైం, డిసెంబరు 6 : జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం నర్వహణకు 25 బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వల్లూరు క్రాంతి తెలిపారు. కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమంపై ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫ్‌రెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనవరి 16 నుంచి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. ప్రతీ గ్రామం, వార్డుల వారీగా కంటి పరీక్షా శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణకు జిల్లాలో 27 మంది అర్హులైన నేత్రవైద్యులను ఇంటర్వ్యూ చేశామని చెప్పారు. జిల్లా పంచాయితీ అధికారి, మునిసిపల్‌ కమిషనర్లు, వైద్య అధికారుల సమన్వయంతో షెడ్యూల్‌ తయారు చేస్తామని వివరించారు. జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అపూర్వ చౌహాన్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శశికళ, డిప్యూటీ డీఎంహెచ్‌వో సిద్ధప్ప ఉన్నారు.

Updated Date - 2022-12-06T22:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising