19న డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం
ABN, First Publish Date - 2022-12-16T23:44:27+05:30
నూతనంగా డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన జి.మధుసూదన్‌రెడ్డి ఈనెల 19న ప్రమాణస్వీకారం చేయనున్నా రని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ముదిరాజ్ అన్నారు.
- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ముదిరాజ్
మహబూబ్‌నగర్, డిసెంబరు 16 : నూతనంగా డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన జి.మధుసూదన్‌రెడ్డి ఈనెల 19న ప్రమాణస్వీకారం చేయనున్నా రని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ముదిరాజ్ అన్నారు. ప్రమాణ స్వీకారో త్సవ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీశ్రేణులు, కార్యకర్తలు తరలి రావాలని కోరారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల టీపీసీసీలో పదవులు దక్కించుకున్న పాలమూరు జిల్లా నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై అన్ని మండలాల్లో కమిటీలను నియమించి ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తామన్నారు. కాంగ్రెస్‌కు అన్ని గ్రామాల్లో మంచి కేడర్ ఉందన్నారు. రానున్న ఎన్నికలో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు అందరం కలిసికట్టుగా ముందుకుసాగుదామన్నారు. ఈ సమావేశంలో నాయకులు చంద్రకుమార్‌గౌడ్, సీజె బెనహ ర్, లక్ష్మణ్‌యాదవ్, సాయిబాబ పాల్గొనన్నారు.
Updated Date - 2022-12-16T23:44:31+05:30 IST