ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూర్యాపేట జిల్లాలో లంపీస్కిన్‌ వైరస్‌

ABN, First Publish Date - 2022-10-08T11:09:05+05:30

సూర్యాపేట జిల్లాలో లంపీస్కిన్‌ సోకిన ఆవును పశువైద్యాధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలో వ్యాధి సోకిన ఆవు గుర్తింపు 

ఆత్మకూర్‌(ఎస్‌), అక్టోబరు 7: సూర్యాపేట జిల్లాలో లంపీస్కిన్‌ సోకిన ఆవును పశువైద్యాధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రానికి చెందిన ఉప్పుల లింగయ్య అనే రైతు.. తన ఆవు కుంటుతుండడంతో వెటర్నరీ ఆస్పత్రికి శుక్రవారం తీసుకువచ్చారు. ఆవు కుడివైపు చర్మంపై అసాధారణంగా బొబ్బలు ఉండటాన్ని గుర్తించిన పశువైద్యశాఖ అధికారి వేణుగోపాల్‌ పరీక్షలు నిర్వహించారు. ఆ ఆవు లంపిస్కిన్‌ వైరస్‌ బారినపడినట్టు తేల్చారు. అనంతరం జిల్లాలోని చింతలపాలెం, మోతె, మేళ్లచెర్వు, కోదాడ మండలాల్లోని పలు గ్రామాల్లోని దాదాపు 23 పశువులకు లంపీస్కిన్‌ వ్యాధి సోకినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో లంపీస్కిన్‌ వ్యాధి నివారణకు శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పశువైద్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివా్‌సరావు తెలిపారు. లంపీస్కిన్‌ వ్యాధి సోకిన ఆవులు, గేదెలను మంద నుంచి వేరు చేయాలని, రాత్రి వేళ వాటికి వేపాకు పొగ వేయాలని సూచించారు.

Updated Date - 2022-10-08T11:09:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising