ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింగగిరిలో నేటి నుంచి లక్ష్మీచెన్నకేశవస్వామి జాతర

ABN, First Publish Date - 2022-01-14T05:52:07+05:30

లింగగిరిలో నేటి నుంచి లక్ష్మీచెన్నకేశవస్వామి జాతర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నారావుపేట, జనవరి 13:  చెన్నారావుపేట మండలం లింగిగిరి గ్రామంలోని పెద్దగుట్టపై వెలిసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి జాతర శుక్రవా రం నుంచి మూడు రోజల పాటు వైభవంగా నిర్వహించనున్నారు.  గ్రామానికి చెందిన దొడ్డ మోహన్‌రావు అందించిన రూ.2కోట్లతో 2019లో గుట్టపై ఆలయాన్ని నిర్మించారు. ప్రతీ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు జాతరను ఘనంగా నిర్వహిస్తారు. డిసెంబరు 16 నుంచి జనవరి 16 వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారి ఎదుట ఉన్న గద్దెకు ముడుపులు చెల్లిస్తారు. జాతరలో భాగంగా 14న శుక్రవారం బోగి పండుగ రోజున గోదాదేవి కల్యాణోత్సవం, 15న శనివారం సంక్రాంతి సందర్భంగా జాతర, కళాకారుల నృత్య ప్రదర్శన, ప్రభ బండ్ల ప్రదర్శన, 16న కనుమ పండుగ రోజున స్వామి ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఎస్సై తోట మహేందర్‌ బందోబస్తు పర్యవేక్షించనున్నారు. 

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

రాకం సాంబయ్య, లింగగిరి ఆలయ ఇన్‌చార్జి 

జాతరకు వస్తున్న భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం.జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలి. ఉదయం నుంచే పూజలు  నిర్వహిస్తాం.

Updated Date - 2022-01-14T05:52:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising