ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష

ABN, First Publish Date - 2022-12-31T00:40:24+05:30

ఒంటరి మహిళను హత్యచేసిన వ్యక్తికి గురువారం భువనగిరి జిల్లా అదనపు కోర్టు న్యాయమూర్తి మారుతీదేవి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫనగలకోసం ఒంటిరి మహిళను హత్యచేసిన బాబు

మోత్కూరు, డిసెంబరు 30: ఒంటరి మహిళను హత్యచేసిన వ్యక్తికి గురువారం భువనగిరి జిల్లా అదనపు కోర్టు న్యాయమూర్తి మారుతీదేవి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. మోత్కూరు ఎస్‌ఐ వి.జానకిరాంరెడ్డి తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామానికి చెందిన ఒంటరి మహిళ సావిత్రమ్మ చిన్న కిరాణం దుకా ణం నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. 2016 మే 10న రాత్రి అదే గ్రామానికి చెందిన బుషిపాక బాబు ఆమెను అతికిరాతకంగా గొంతు నులిమి హత్యచేసి నగ లు అపహరించాడు. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసును దర్యాప్తు జరిపిన అప్ప టి రామన్నపేట సీఐ ఎం.శ్రీధర్‌రెడ్డి పలు కోణాల్లో కేసును పరిశోధించి కొన్ని సాంకేతిక ఆధారాలు సేకరించారు. వాటి ఆధారంగా నేరస్తుడు బుషిపాక బాబుతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు పంపారు. ఈ కేసులో సేకరించిన సాంకేతిక ఆధారాలతో బుషిపాక బాబుపై అభియోగ పత్రాన్ని దాఖలుచేశారు. ఈ కేసు లో లభించిన సాంకేతిక ఆధారాలు, సాక్షులను విచారించిన జిల్లా అదనపు జడ్జి మారుతీదేవి నిందితుడు బాబు నగలకోసం మహిళను హత్య చేసినట్టుగా నిర్ధారించి నేరస్తుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. కేసు దర్యాప్తు జరిపిన పోలీస్‌ అధికారి శ్రీధర్‌రెడ్డిని అభినందించారు.

Updated Date - 2022-12-31T00:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising