ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వామపక్షాలు మా సహజ మిత్రులు

ABN, First Publish Date - 2022-10-12T09:33:18+05:30

కమ్యూనిస్టు పార్టీలు, తాము సహజ మిత్రులమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మాకు ఉమ్మడి శత్రువు బీజేపీ
  • కార్యకర్తలు ఆలోచించి ఓటేయాలి
  • ఆఫీసుని తగలబెట్టడం మగతనమా?
  • చండూరు రోడ్‌షోలో రేవంత్‌ ధ్వజం 
  • ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను కలిసిన రేవంత్‌
  • మా రెండు పార్టీలకు ఉమ్మడి శత్రువు బీజేపీ: రేవంత్‌ రెడ్డి

చండూరు రూరల్‌, అక్టోబరు 11: కమ్యూనిస్టు పార్టీలు, తాము సహజ మిత్రులమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘ఢిల్లీలో కొట్టాడింది మీరు, మేమే. మన కామన్‌ శత్రువు బీజేపీ. మీరు కూడా ఆలోచించి ఓటు వేయాలి’’ అని కమ్యూనిస్టు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ, పుల్లెంల, చామలపల్లి, కస్తాల గ్రామాల్లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని, బీజేపీ, టీఆర్‌ఎస్‌ వాళ్లు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. చెట్టుకు కట్టేసి కొడతామన్నారు. కాంగ్రెస్‌ కార్యాలయంలో గుర్తుతెలియని దుండగులు చేసి న పని సిగ్గుచేటు అన్నారు. ఎవరూ లేని సమయంలో పక్క పార్టీ వాడి కార్యాలయాన్ని తగలబెట్టడం మగతనమా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నిక ప్రజలు కోరుకుంటే రాలేదని, ఇక్కడి ఎమ్మెల్యేను గుజరాత్‌ మారు బేరగాళ్లకు అమ్ముడుపోతే వచ్చిందని ఆరోపించారు. రాజీనామా చేస్తే ఈ ప్రాంతానికి నిధులు వస్తాయన్న రాజగోపాల్‌రెడ్డి.. చర్లగూడెం రిజర్వాయర్‌కు ఎన్ని నిధులు వచ్చాయో చెప్పాల న్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసం చేసి అమ్ముడుపోయిన వారికి మాత్రం రూ.20 లక్షలు, రూ.30 లక్షలు వచ్చాయన్నారు. 2014లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని, 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించినా ఈ ప్రాంతం అభివృద్ధి జరగలేదని, గతంలో దివంగత నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చేసిన అభివృద్ధే కనిపి స్తోందని చెప్పారు. కేసీఆర్‌ పెట్టిన కొత్త పార్టీ బీఆర్‌ఎస్‌.. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ సమితి అని, అందులో బ్రాండీ, రమ్ము, సారా లభిస్తుందని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికులు 60 మంది ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం పట్టించుకోలేదని, వీఆర్‌ఏలు 40 మంది చనిపోతే పట్టించుకోలేదని, అలాంటి దయనీయ పరిస్థితిలో రాష్ట్రం ఉందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, పున్న కైలాష్‌ నేత, పల్లె రవికుమార్‌, బుర్కల భిక్షం తదితరులు పాల్గొన్నారు.   


ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను కలిసిన రేవంత్‌

నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపూర్‌ గ్రామంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కొండాపూర్‌కు చెందిన నాయకుడు దుబ్బాక వెంకన్నను పరామర్శించేందుకు ప్రవీణ్‌కుమార్‌ రావడంతో అటుగా వెళ్తున్న రేవంత్‌రెడ్డి ఆయనతో మాట్లాడారు. 

Updated Date - 2022-10-12T09:33:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising