ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులపై లాఠీ

ABN, First Publish Date - 2022-08-20T09:38:40+05:30

నిజామాబాద్‌ జిల్లా సిరికొండకు చెందిన పలువురు రైతులపై అటవీశాఖ సిబ్బంది శుక్రవారం లాఠీలు ఝళిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూమిని చదును చేస్తున్న అన్నదాతల అడ్డగింత

ఆపై వారిని చితకబాదిన అటవీ శాఖ సిబ్బంది

సిరికొండ, ఆగస్టు 19: నిజామాబాద్‌ జిల్లా సిరికొండకు చెందిన పలువురు రైతులపై అటవీశాఖ సిబ్బంది శుక్రవారం లాఠీలు ఝళిపించారు. వ్యవసాయ భూమిని చదును చేసుకుంటున్న వారిని అడ్డుకుని చితకబాదారు.  సిరికొండలోని 532 సర్వే నెంబర్‌లోని భూమికి 166 మంది రైతులకు 12ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. పట్టాలు పొందిన రైతులు నాటి నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు రైతులు శుక్రవారం ఆ భూమిని చదును చేస్తుండగా అటవీ శాఖ సిబ్బంది అడ్డుకున్నారు. సదరు భూమి అటవీ శాఖదని, ఎట్టి పరిస్థితుల్లో సాగుకు అనుమతించమని స్పష్టం చేశారు. తమ వద్ద పట్టాలు ఉన్నాయని రైతులు చెబుతున్నా పట్టించుకోకుండా.. పలువురిని చితకబాదారు. దీంతో ఆగ్రహించిన రైతులు మూకుమ్మడిగా సిరికొండ పోలీసుస్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు.  ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి(డీఆర్‌ఓ) గంగారాం పోలీసు స్టేషన్‌కు చేరుకొని సీఐ చంద్రశేఖర్‌ సమక్షంలో రైతులకు క్షమాపణ చెప్పారు. దీంతో శాంతించిన రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Updated Date - 2022-08-20T09:38:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising