ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పబ్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విషయం మాకు తెలియదు: కుషితా

ABN, First Publish Date - 2022-04-04T14:08:03+05:30

హైదరాబాద్ నగరంలో లేట్ నైట్ పబ్‌లో ఉండటం తమ తప్పు కాదని.. షార్ట్ ఫిలిం నటి కల్లపు కుషితా పేర్కొంది. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విషయం తమకు తెలియదని వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో లేట్ నైట్ పబ్‌లో ఉండటం తమ తప్పు కాదని.. షార్ట్ ఫిలిం నటి కల్లపు కుషితా పేర్కొంది. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విషయం తమకు తెలియదని వెల్లడించింది. తెలిస్తే తాము అక్కడికి ఎందుకు వెళ్తామని ప్రశ్నించింది. ఇంకా కుషితా మాట్లాడుతూ.. ‘‘అక్కడ రష్ ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. మా ఫ్రెండ్స్ పార్టీ అయ్యాక బయటకి వెళదామని అనుకునే లోపే పోలీసులు వచ్చారు! అందరిని బాధ్యులను చేయడం....పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం సరికాదు! పోలీసులు వచ్చారు మా డిటైల్స్ తీసుకున్నారు...! మేము పోలీసులకు సహకరించము... కావాల్సి వస్తే మా రక్త నమూనాలు (శాంపిల్స్) తీసుకోండి. మేము ఎప్పుడైనా శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధమే. మీడియా వాళ్లు కొంచం సమన్వయం పాటించాలి. పబ్‌కి వచ్చిన వాళ్ళందరినీ బద్నామ్ చేయడం సరికాదు. మేము ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ఎదుగుతున్నాం. మమ్మల్ని ఇలా బద్నామ్ చేయడం సరి కాదు. 150 మంది పబ్‌లో ఉన్నవారందరిపై ఇలా ద్రుష్పచారం చేయడం సరి కాదు. అందరి రక్త నమూనాలు తీసుకొని ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోండి. మేము కూడా సహకరిస్తాం. ఇలాంటి దృష్ప్రచారం వల్ల మా కుటుంబసభ్యులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పబ్ అర్ధరాత్రి వరకు నడిపించే వారిపై చర్యలు తీసుకోండి..! మేము జస్ట్ ఆఫ్టర్ పార్టీకి వెళ్ళాం. దయచేసి మీడియా వారు మమ్మల్ని బద్నాం చేయకండి’’ అని తెలిపింది.

Updated Date - 2022-04-04T14:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising